Site icon HashtagU Telugu

Honey: ముఖంపై మొటిమలు తగ్గాలి అంటే తేనెతో ఇవి కలిపి రాయాల్సిందే?

Mixcollage 01 Feb 2024 01 27 Pm 8898

Mixcollage 01 Feb 2024 01 27 Pm 8898

మామూలుగా స్త్రీ పురుషులకు ముఖంపై మొటిమలు రావడం అన్నది సహజం. ముఖంపై మొటిమలు రావడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అయితే ఈ మొటిమలను తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగించడంతోపాటు డ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దీనికోసం వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఎటువంటి ఖర్చు లేకుండా కొన్ని ఇంటి చిట్కాలు ఉపయోగించి ఈ మొటిమలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం తేనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

తేనెలో 7 రకాల అమైనో యాసిడ్స్, 10 ఖనిజాలు, విటమిన్ సి, బి కాంప్లెక్స్, నేచురల్ ఎంజైమ్స్, యాంటీ మైక్రోబయల్, యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ వంటి గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్మానికి చాలా మంచివి. దీనిని వాడితే చాలా వరకూ సమస్య తగ్గుతుంది. బొప్పాయి గుజ్జులో తేనె కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసి అలానే 30 నిమిషాల పాటు ఉండాలి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. బొప్పాయి, తేనె మిశ్రమంలు చర్మంపై ఉన్న సమ్యలు తగ్గించి చర్మాన్ని మెరిపిస్తుంది. కాబట్టి, రెగ్యులర్‌గా వాడవచ్చు. తేనె త్రిఫల రెండింటిని మిక్స్ చేయాలి. ఇది ఒక లేహ్యంలా తయారవుతుంది.

దీనిని మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి. 30 నిమిషాల పాటు ఉండి తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. తేనెని, నిమ్మరసంతో కలపాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల పాటు అలానే ఉండండి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. దీని వల్ల ముఖంపై ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. మొటిమలపై నేరుగా తేనెని రాయాలి. దీనిని 20 నుంచి 30 నిమిషాల పాటు అలానే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేయాలి. దీనిని మొటిమల సమస్య తగ్గేవరకూ రోజుకి రెండు సార్లు చేయవచ్చు. తేనె అలోవెరా రెండు కూడా చర్మానికి మేలు చేసేవే. ఈ రెండింటి కలయిక చర్మంపై ఉన్న మొటిమలు, మచ్చల వంటి సమస్యల్ని దూరం చేస్తాయి.