మామూలుగా ఒక వయసు వచ్చిన తర్వాత ముఖములు వాటి తాలూకా మచ్చలు రావడం అన్నది సహజం. వీటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే చాలా రకాల బ్యూటీ ప్రొడక్తులు ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వీటి కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. చాలామంది అందంగా కనిపించడం కోసం బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరగడంతో పాటు వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఇకపోతే మొటిమలు మచ్చలు ఉన్నప్పుడు అవి ముఖాన్ని అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. అయితే మొటిమలు మచ్చలు తగ్గించుకోవడానికి ఏం చేయాలో ఎటువంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జామ ఆకులతో కూడా ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చట. ఈ ఆకుల్లో విటమిన్ సి, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని, ఇవి మన చర్మాన్ని కాంతి వంతంగా చేయడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ముఖంపై నల్ల మచ్చలను, తెల్ల మచ్చలను పోగొట్టడానికి బాగా సహాయపడతాయట. కాగా కొంతమందికి డ్రై స్కిన్ ఉంటే మరి కొంతమందికి ఆయిలీ స్కిన్ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారు ఎంత మేకప్ వేసినా కొద్దిసేపటికే ముఖం జిడ్డుగా మారుతూ ఉంటుంది. ఇలాంటి వారు ఎలాంటి కాస్మోటిక్స్ ఉపయోగించినా ఎలాంటి ఉపయోగం ఉండదు.
అయితే ఇలాంటి వారికి జామ ఆకులు బాగా ఉపయోగకరంగా ఉంటాయట. అయితే ఇందుకోసం ముందుగా గుప్పెడు జామ ఆకులను తీసుకుని నీళ్లలో నాన బెట్టాలట. దీన్ని పేస్ట్ గా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి, మెడకు బాగా అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత కూల్ వాటర్ తో ముఖాన్ని మెడను శుభ్రం చేయాలి. జామ ఆకుల్లో ఉండే పోషకాలు మీ ముఖంలో ఉండే నూనెను నియంత్రించడానికి సహాయపడుతుందట. ఈ పద్దతి జిడ్డును చాలా వరకు తగ్గించడానికి సహాయపడుతుందట. ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలుంటే అందంగా కనిపించవట. ఈ చర్మ సమస్యల వల్ల ఒక్కోసారి ఆడవారు బయటకు వెల్లడానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు. అయితే ఈ సమస్యలను తగ్గించడంలో జామ ఆకులు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయట. అయితే ఇంతకీ జామ ఆకులను ఎలా ఉపయోగించాలి? అన్న విషయానికి వస్తే..
జామ ఆకులను ఉపయోగించి ముఖంపై ఉన్న తెల్ల మచ్చలను, నల్ల మచ్చలను, మొటిమల వల్ల అయ్యే మొండి మచ్చలను సులువుగా పోగొట్టవచ్చు. ఇందుకోసం గుప్పెడు జామ ఆకులను తీసుకుని అందులో కలబంద గుజ్జు, కొంచెం పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిముషాల పాటు అలాగే వదిలేసి, తర్వాత కూల్ వాటర్ తో ముఖాన్ని కడగాలి. తరచుగా ఇలా చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయట. పొడి చర్మం ఉన్నవారికి కూడా జామ ఆకులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. అలాగే చర్మ చికాకును తగ్గించడానికి కూడా జామ ఆకులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. దీనికోసం జామ ఆకుల స్ప్రే ని ఉపయోగించాలట. ఇందుకోసం ఒక కప్పు జామ ఆకులను తీసుకుని అందులో నీళ్లు పోసి 10 నిమిషాల పాటు బాగా మరిగించి చల్లారిన తర్వాత నీళ్లను వడకట్టి స్ప్రే బాటిల్ లో పోయాలట. ముఖాన్ని నీట్ గా కడిగిన తర్వాత ముఖానికి ఈ స్ప్రే చేయాలనీ చెబుతున్నారు.