Site icon HashtagU Telugu

Lips Tips: నల్లని పెదాలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

Lips

Lips Tips

ముఖంపై చిరునవ్వు ప్రతి ఒక్కరికి అందం. అయితే ఆ చిరునవ్వును చిందించే పెదాలు అందంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. కొందరి పెదాలు నల్లగా ఉంటే మరికొందరి పెదాలు ఎర్రగా నిగనిగిలాడుతూ ఉంటాయి. అయితే మృదువైన ఎర్రటి పెదాల కోసం చాలామంది రకరకాల హోమ్ రెమిడీస్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించకపోవడంతో దిగులు చెందుతూ ఉంటారు. నిజానికి పెదవుల నల్లగా మారడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. కెఫైన్, యూవీరేస్, ఊహించని అలర్జీస్, స్మోకింగ్, అలాగే హార్మోన్ల అసమతుల్యతలు వంటివి పెదాలను డార్క్ కలర్ లోకి మారుస్తాయి. ఈ రోజులు స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా ఎర్రని పెదాలను కోరుకుంటున్నారు.

మరి పెదాలపై ఉన్న నలుపు పోయి ఎర్రగా మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. షీ బటర్, వాజిలైన్, ఆల్మండ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా కోకో బటర్ అనేవి మీ పెదాలను మళ్ళీ మాములుగా చేస్తాయి. వీటిలో ఏదైనా ఒకదానిని రోజంతా అప్లై చేయడం వల్ల మీ పెదాలు మృదువుగా అలాగే హెల్తీగా మారతాయి. ఇండియా లోని అత్యంత గొప్ప బ్యూటీ సీక్రెట్ ఇంగ్రిడియెంట్ గా అలోవెరాను చెప్పుకోవచ్చు. రోజుకు రెండు సార్లు అలోవెరా జెల్ ను అప్లై చేసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే మీ పెదాలు సాఫ్ట్ గా మారడంతో పాటు ఎర్ర బడతాయి. అలాగే విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి గ్రేట్ రెమెడీగా పనిచేస్తాయి. ఇవి స్కిన్ అలాగే హెయిర్ కేర్ కు కూడా బాగా పనిచేస్తాయి.

విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి మార్కెట్ లో సులభంగా లభ్యమవుతాయి. మీరు చేయాల్సిందల్లా ఈ టాబ్లెట్స్ ను బ్రేక్ చేసి ఈ లిక్విడ్ ను పెదాలపై రోజుకు రెండు సార్లు అప్లై చేయాలి. మీ లిప్స్ హైడ్రేట్డ్ అయ్యే వరకు అలాగే పింక్ గా మారేవరకు ఈ ప్రాసెస్ ను కొద్దిరోజుల పాటు పాటించడం మంచిది. మార్కెట్ లో లభ్యమయ్యే ఏ బామ్స్ కూడా మీకు సూట్ కాకపోతే మీరు తగిన ఆల్టర్నేటివ్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా రెండు టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షీ బటర్ అలాగే 1 టేబుల్ స్పూన్ గ్రేటెడ్ బీస్ వ్యాక్స్, 10 డ్రాప్స్ విటమిన్ ఈ ఆయిల్ అలాగే 10 డ్రాప్స్ ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ ను తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్, షీ బటర్ అలాగే బీస్ వ్యాక్స్ ను గ్లాస్ డిష్ లో ఉంచి కొద్ది సెకండ్లపాటు మైక్రో వేవ్ చేయాలి. పూర్తిగా మెల్ట్ అయ్యేవరకు ఇలా చేయాలి. ఆ తరువాత చల్లారనివ్వాలి. మిగతా పదార్థాలను బాగా కలిపి వాటిని కాసేపు సెట్ కానివ్వాలి. దీన్ని వాడితే ప్రయోజనం ఉంటుంది.