Regrow Hair: బట్టతల వచ్చేలా ఉందా ? జుట్టు రాలుతోందా ? ఈ చిట్కాలతో సమస్యకు చెక్!!

తీవ్రమైన ఒత్తిడి, పోషకాహార లోపం, నిద్రలేమి సమస్య సహా వివిధ కారణాలతో చాలామంది బట్టతల బారిన పడుతున్నారు.

  • Written By:
  • Publish Date - September 20, 2022 / 10:15 AM IST

తీవ్రమైన ఒత్తిడి, పోషకాహార లోపం, నిద్రలేమి సమస్య సహా వివిధ కారణాలతో చాలామంది బట్టతల బారిన పడుతున్నారు. ఈ బట్టతలతో నలుగురిలోకి వెళ్లాలంటే తెగ ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అయితే చిన్న సింపుల్ చిట్కాలా ద్వారా ఈ బట్టతల నుంచి బయటపడొచ్చు. అవేంటంటే..

* జుట్టు ఎందుకు రాలుతుంది?

జుట్టు రాలడం అనేది చాలా విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది. తల్లిదండ్రులు, తాతలకు కుటుంబంలో జుట్టు రాలే సమస్య ఉంటే.. మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటారు. మీ ఆహారం కూడా జుట్టును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అసలైన, రక్తం జుట్టుకు చేరుకోవడం చాలా ముఖ్యం.
విటమిన్ B12 అనేది ఎర్ర రక్త కణాలను తయారు చేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లకు ఎర్ర రక్త కణాలను చేరవేస్తుంది. ఈ ఎర్ర రక్త కణాలు హెయిర్ ఫోలికల్స్‌ కు చేరితే.. కొత్త వెంట్రుకలు ఏర్పడటం కొనసాగుతుంది. పాత జుట్టుకు కూడా పోషణ లభిస్తుంది. మీకు విటమిన్ బి 12 లోపిస్తే, ఆర్‌బిసిలు వెంట్రుకల కుదుళ్లకు చేరవు. ఫలితంగా కొత్త జుట్టు ఏర్పడదు.. పాత వాటికి పోషణ ఉండదు. దీంతో జుట్టు రాలడం నిరంతరం కొనసాగడానికి ఇదే కారణం.

* విటమిన్ B-12 పొందటం ఇలా..

విటమిన్ B12 శరీరంలో సొంతంగా తయారు చేయబడదు. దీని కోసం మీరు పోషకాలను తీసుకోవాలి. మీరు మాంసాహారులైతే.. మొలకెత్తిన ధాన్యాలను ప్రతిరోజూ తినాలి. ఇది కాకుండా.. మటన్, కిడ్నీ, కాలేయం,గుడ్డు, ట్యూనా ఫిష్, ట్రాట్ ఫిష్, సార్డిన్ ఫిష్‌లలో
విటమిన్ బి12 తగినంత మొత్తంలో ఉంటుంది. మీరు కెమిస్ట్ దుకాణంలో విటమిన్ B12 సప్లిమెంట్లను కూడా వైద్యుని సూచన మేరకు తీసుకుంటే మంచిది.

* మీ మెనూలో ప్రోటీన్లు కలిగిన ఆహార పదార్థాల మోతాదును పెంచండి. హెయిర్ ఫోలికల్స్ ఏర్పడటంలో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి.

* బయోటిన్ ను విటమిన్ బీ7 అని కూడా పిలుస్తారు. మీ వెంట్రుకల్లో కేరాటిన్ ఉత్పత్తి ని పెంచడానికి బయోటిన్ ఉపయోగపడుతుంది.
హెయిర్ ఫోలికల్స్ గ్రోత్ కోసం కూడా ఇది దోహదం చేస్తుంది. ఓట్స్, ఉల్లిపాయలు, గుడ్లు, శెనక్కాయలలో బయోటిన్ మోతాదు ఎక్కువగా ఉంటుంది.

* షాంపూ ఎంపికలో ఆచితూచి వ్యవహరించాలి. ఫ్రూట్స్, సీడ్ ఆయిల్, కొబ్బరి, జోజోబా,ఆలివ్, అలోవీర, కెఫిన్ వంటి పదార్థాలు కలిగిన షాంపూలు వాడితే బాగుంటుంది.

* కంటి నిండా నిద్రపోతే జుట్టు రాలే సమస్య చాలావరకు తగ్గుతుంది. నిద్రపోయాక మన శరీరంలోని గ్రోత్ హార్మోన్స్ పని మొదలు పెడతాయి. అవి మన వెంట్రుకలు పెంచే పనిలో నిమగ్నం అవుతాయి. కాబట్టి రోజూ 8 నుంచి 9 గంటలు నిద్రపోండి.

* ఇంటి చిట్కాలు ఇవిగో

ఉల్లిపాయ: ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టుకు రక్తం సరఫరా మెరుగు అయ్యేలా చేస్తుంది. దీంతో బట్టతల సమస్యకు చెక్ పడుతుంది. ఇందుకోసం.. అవసరమైన ఉల్లిపాయలను తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ నుంచి రసాన్ని వేరు చేసి ఇందులో కాస్త తేనే కలపాలి. దాన్ని తలకు అప్లై చేసి  కొద్ది సేపు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకల్లో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు చనిపోతాయి.

ఆముదం నూనె: బట్టతల, హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెట్టడంలో ఆముదం నూనె బాగా పనిచేస్తుంది. ఈ నూనెను వేలితో కొంచెం కొంచెం తీసుకుని తలకు పెట్టుకోవాలి. దాంతో మీ జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది.
కొబ్బరి నూనె:  కొబ్బరి నూనెను ప్రతి రోజూ వెంట్రుకలకు రాసుకున్నా ఎటువంటి సమస్య రాదు. నైట్ పడుకునే ముందు గోరువెచ్చటి లేదా నార్మల్ గా ఉన్నా కొబ్బరి నూనెను తలకు బాగా పట్టించాలి. ఆ తర్వాత ఒక పది లేదా 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మరుసటి రోజు మార్నింగ్ హెడ్ బాత్ చేస్తే జుట్టు గ్రోత్ బాగుంటుంది.

మెంతులు:   మెంతులను కాసేపు నీళ్లలో నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ను తలకు అప్లై చేసి ఒక గంటపాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత నీట్ గా జుట్టును క్లీన్ చేయాలి.

నిమ్మకాయ:  నిమ్మకాయతో హెయిర్ ఫాల్, డాండ్రఫ్, డ్రై హెయిర్ వంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు. బట్టతల మటుమాయం కావాలంటే మీరు తలకు రాసుకునే నూనెను కొద్దిగా తీసుకుని అందులో కాస్త నిమ్మరసం కలపండి. దాన్ని మీ వెంట్రుకలకు బాగా పట్టించండి.