Water melon : ఎండాకాలంలో దొరికే ఈ పండుతో ముఖాన్ని అందంగా మార్చేసుకోండి..

ఎండాకాలంలో అందరూ పుచ్చకాయలు తింటారు. ఎండాకాలంలో పుచ్చకాయలు తినడం వల్ల తక్షణ శక్తి ఇస్తుంది. అయితే పుచ్చకాయలు ఎండాకాలంలో ఆరోగ్యానికి మాత్రమే కాదు ముఖానికి కూడా బాగా పనిచేస్తుంది.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 06:57 PM IST

ఎండాకాలంలో(Summer) మామిడిపండ్లతో(Mangoes) పాటు పుచ్చకాయలు(Watermelon) కూడా ఎక్కువగా దొరుకుతాయి. పుచ్చకాయలు ఆరోగ్యానికి చాలా మంచిదని, అందులో వాటర్(Water) శాతం ఎక్కువగా ఉంటుందని అందరికి తెలిసిందే. ఎండాకాలంలో అందరూ పుచ్చకాయలు తింటారు. ఎండాకాలంలో పుచ్చకాయలు తినడం వల్ల తక్షణ శక్తి ఇస్తుంది. అయితే పుచ్చకాయలు ఎండాకాలంలో ఆరోగ్యానికి మాత్రమే కాదు ముఖానికి కూడా బాగా పనిచేస్తుంది.

పుచ్చకాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరాన్ని తాజాగా ఉంచేలా చేస్తాయి. పుచ్చకాయ తినడం వల్ల ఎండాకాలంలో చర్మం ఎక్కువగా డీ హైడ్రేట్ అవ్వకుండా చూస్తుంది. దీనివల్ల చర్మంలోని మలినాలు, జిడ్డు కూడా తొలుగుతాయి.

ఒక స్పూను పుచ్చకాయ రసంలో కొన్ని చుక్కల కొబ్బరినూనె వేసి బాగా కలిపి దూదితో ముఖానికి, మెడకు రాసుకొని ఒక పదినిమిషాలు ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో కడగాలి. దీనివల్ల ముఖంలో గ్లో వస్తుంది. రెండు చెంచాల బియ్యప్పిండిలో కొంచెం పుచ్చకాయ రసం కలిపి మొహం పై మృదువులా రుద్దుతూ మసాజ్ లాగా చేయాలి. కొంచెం సేపు తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా రెగ్యులర్ గా కొన్ని రోజులు చేస్తే ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తొలిగిపోతాయి. అలాగే ముఖంపై ఉండే మృతకణాలను కూడా ఈ మిశ్రమం తొలిగిస్తుంది.

కొంచెం శనగపిండి, పుచ్చకాయ రసం, కొంచెం పాలు కూడా కలిపి ఈ మిశ్రమాన్ని మొహానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చన్నీళ్లతో కడగాలి. ఇలా చేయడం వల్ల సహజంగా ముఖం మెరుస్తుంది. ఇక పుచ్చకాయ ముక్కలని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల కంటికి మంచిది. మనం రెగ్యులర్ గా ఫోన్ చూడటం, సిస్టమ్ ముందు పని చేయడంతో కళ్ళకు మంటలు, కళ్ళు నొప్పెట్టడం లాంటివి వస్తుంటాయి. కళ్ళు మూసుకొని పుచ్చకాయ ముక్కల్ని కంటి మీద పెట్టి కాసేపు ఉంచితే చల్లగా ఉంటుంది. కంటికి కూడా మంచిది. ఈ ఎండాకాలంలో మనకు దొరికే పుచ్చకాయతో ఆరోగ్యమే కాక అందం కూడా తెచ్చుకోండి.

 

Also Read :   Morning Works : ఉదయం లేవగానే ఇలా చేయండి.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.. కొన్ని పనులు అస్సలు చేయకూడదు..