Watching TV: టీవీని ఎక్కువ సేపు చూస్తున్నారా.. మీ ప్రాణానికి ప్రమాదం?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో రెండు మూడు టీవీలు ఉంటున్నాయి. అయితే టీవీ చూడటం

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 07:30 AM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో రెండు మూడు టీవీలు ఉంటున్నాయి. అయితే టీవీ చూడటం అన్నది కాలయాపనగా మారింది అని చెప్పవచ్చు. అంతేకాకుండా చాలామందిని హ్యాబిట్స్ అడిగినప్పుడు వాచింగ్ టీవీ అని కూడా చెబుతూ ఉంటారు. అలా టీవీ చూడటాన్ని వారి అలవాట్లలో ఒకదానిగా మార్చేసుకున్నారు. ఇక మరీ ముఖ్యంగా ఆడవారు అయితే టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతిరోజు గంటల తరబడి చాలామంది టీవీల ముందు కలుపుతూ ఉంటారు. పిల్లలు కార్టూన్స్ చూస్తూ టీవీల ముందు గంటల తరబడి గడపగా, ఇంట్లోనే స్త్రీలు సీరియల్స్ సినిమాలు చూస్తూ టీవీల ముందు గడుపుతూ ఉంటారు.

ఇక వృద్ధులు అయితే ఏదైనా దేవుడి కార్యక్రమాలు ప్రవచనాల కార్యక్రమాలను చూస్తూ ఉంటారు. అయితే ఇలా గంటల తరబడి టీవీలు చూడటం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎక్కువసేపు టీవీని చూడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఒక గంట కంటే తక్కువసేపు టెలివిజన్ చూడటం వల్ల 11 శాతం వరకు కొరోనరీ హార్ట్ డిసీజ్ ను నివారించవచ్చు. కేవలం టీవీలు మాత్రమే కాకుండా గంటల తరబడి మొబైల్స్ కంప్యూటర్స్ లాప్టాప్ ల ముందు కూర్చుంటూ ఉంటారు. ఎలక్ట్రానిక్ పరికరాల ముందు గంటలకొద్దీ కూల్చడం వల్ల కొరోనరీ గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

కాగా నాలుగు గంటల కంటే ఎక్కువగా టీవీ చూసే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నాలుగు గంటల కంటే తక్కువగా టీవీ చూసే వారిలో గుండె జబ్బుల ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్లు వైద్యులు ఒక పరిశోధనలో కనుగొన్నారు. అలాగే ఒక గంట కంటే తక్కువసేపు చూసేవారు 16 శాతం తక్కువ గుండెజబ్బు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. రోజులో దాదాపు చాలా గంటలపాటు టీవీలో కంప్యూటర్ల ముందు గడుపుతూ ఉంటారు. అయితే కొంతమంది ఎప్పుడైనా కొత్త సినిమాలు పడితే ఆ సినిమా అయిపోయే వరకు టీవీ దగ్గర నుంచి పక్కకు కదలకుండా అలాగే ఆ సినిమాలను చూస్తూ ఉంటారు. ఇలా గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం మంచిది కాదు. టీవీల ముందు లేదంటే కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా రోజుకు నాలుగు గంటల కంటె ఎక్కువగా టీవీల ముందు కూర్చోవడం వల్ల మెదడు దెబ్బతినడమే కాకుండా, కాళ్ళు లేదా ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడానికి కూడా దారితీస్తుంది.