Study : రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఎక్కువ సేపు రీల్స్ లేదా చిన్న వీడియోలు చూడటం లేదా మొబైల్ చూడటం వల్ల అధిక రక్తపోటు వస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. దీపక్ కృష్ణమూర్తి అనే వైద్యుడు దీని గురించి ఎక్స్‌లో సమాచారాన్ని పంచుకున్నారు. రీల్స్ చూడటం ఎందుకు ప్రమాదకరమో వివరించాడు. దీనికి సంబంధించిన సమాచారం ఇదిగో.
సోషల్ మీడియాలో రీల్స్ లేదా చిన్న వీడియోలను చూడటం యువకులు , మధ్య వయస్కుల జీవితంలో అంతర్భాగంగా మారింది. తిని పడుకున్నాక కూడా రీళ్లు చూస్తూ కాలం గడిపేస్తుంటారు. నిద్రవేళలో రీల్స్ చూడటం, మొబైల్ ఫోన్లు చూస్తూ ఎక్కువ సమయం గడపడం వల్ల యువత , మధ్య వయస్కుల్లో అధిక రక్తపోటు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది.
Vastu Tips: పాత బట్టలు పడేస్తున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
BMC జర్నల్‌లో ప్రచురించబడిన ఒక కథనంలో, చైనాలోని 4,318 మంది యువకులు , మధ్య వయస్కులపై జరిపిన ఒక అధ్యయనంలో అత్యధిక రీల్స్‌ను చూసే వారు అధిక రక్తపోటుతో బాధపడే అవకాశం ఉందని కనుగొన్నారు.
బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డా. దీపక్ కృష్ణమూర్తి పంచుకున్న పరిశోధన నివేదిక కళ్లు తెరిపించింది.
దీని గురించి దీపక్ కృష్ణమూర్తి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నిద్రవేళలో రీల్స్ చూసే సమయం ఆధారంగా అధ్యయనం నిర్వహించబడింది. నిద్రపోయేటప్పుడు మొబైల్ చూడటం ఒక విరామం లేని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. నిద్రవేళలో వీడియోలు చూడటం వల్ల నాడీ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుందని, ఇది నిద్రలేమి, రక్తపోటుకు దారితీస్తుందని తెలిపారు.
పరిశోధకులు ఫెంగ్డే లి, ఫాంగ్‌ఫాంగ్ మా, షాంగ్యు లియు, లే వాంగ్, లిషువాంగ్ జీ, మింగ్‌కి జెంగ్ , గ్యాంగ్ లియు ప్రకారం, నిద్రవేళలో చిన్న వీడియోలు , రీల్స్ చూడటం నియంత్రించాలి, లేకుంటే అది అధిక రక్తపోటుకు దారి తీస్తుంది.