Hair tips: ఉప్పు నీటితో జుట్టును కడగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. జుట్టు చిట్లిపోవడం తెల్ల జుట్టు రావడం జుట్టు

  • Written By:
  • Publish Date - December 25, 2023 / 07:05 PM IST

ఈ రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. జుట్టు చిట్లిపోవడం తెల్ల జుట్టు రావడం జుట్టు రాలిపోవడం చుండ్రు ఇలా ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి బయటపడడం కోసం చాలామంది అనేక రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే మీరు కూడా జుట్టుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే ఉప్పు నీటిని జుట్టుకు ఉపయోగించాల్సిందే అంటున్నారు వైద్యులు.

మాములుగా ఉప్పుని వంటలలో వాడుతూ ఉంటాం. ఉప్పు వాడితే వెంట్రుకలు రాలిపోతాయి కదా మరి ఉప్పుతో రెమిడి ఏంటి అని అనుకుంటున్నారా. మరి ఆ వివరాల్లోకి వెళితే.. ఈ ఉప్పుతో చర్మం ఎక్స్ పోలియేట్ చేయడానికి డిహైడ్రేషన్ నివారించడానికి అలాగే గొంతు నొప్పిని తగ్గించడానికి ఇలా చాలా వాటికి ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జుట్టు రక్షణ కోసం కూడా ఉప్పును వినియోగించవచ్చు.. జుట్టులో చుండ్రు లేదా చెమట ఉంటే ఈ ఉప్పు బాగా సహాయపడుతుంది. అలాగే అనేక ఇబ్బందులను తగ్గించడానికి మీరు మీ జుట్టు రక్షణలో ఉప్పును వాడుకోవచ్చు.

జుట్టు, చర్మంలో చుండ్రు, పొడి, దురద లాంటి ఇబ్బంది ఉంటే మీరు వాటిని ఉప్పు వినియోగంతో క్లీన్ చేసుకోవచ్చు. ఉప్పులో స్పటికాలు మీ దెబ్బతిన్న వెంట్రుకలను రక్షిస్తుంది. జుట్టు ఎదుగుదలను పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు చర్మంలో బ్లడ్ సర్కులేషన్ మెరుగుపరచడం అలాగే, రంధ్రాలను శుభ్రం పరచడం చాలా ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో జుట్టుకు ఉప్పు ఎక్స్ పోల్యేటర్ ను అందిస్తుంది. దీనివలన జుట్టు పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలిపోతున్న ,విరిగిపోతున్న జుట్టు ఆరోగ్యంగా లేకపోయినా దీనికి కారణం అలాంటి పరిస్థితుల్లో మీరు జుట్టుని రక్షించడం కోసం ఉప్పుని వినియోగించినప్పుడు దాన్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, సిలినియం, ఖనిజాలు జుట్టుని బలంగా మార్చడంలో సహాయపడుతుంది. జుట్టులో జిడ్డు ఎక్కువగా ఉంటే ఉప్పు నీటితో కడగడం వలన జుట్టులో ఉండేటువంటి అధిక జిడ్డు తొలగిపోతుంది. కాగా మాములుగా వాస్తవానికి ఉప్పులో యాంటీ పంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది జుట్టు లేదా శిరోజాలను శుభ్రపరుస్తుంటాయి. దానిలోని ఎక్కువ ఆయిల్ ని తొలగిస్తాయి. దీనివల్ల చుండ్రు సమస్య రోజురోజుకి తగ్గిపోతుంది