Beauty Tips: రెండు వారాల్లో మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే?

చాలామంది అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి చర్మం మెరిసిపోయేలా చేసుకోవడానికి ఎన్నో రకాల బ్యూటీ పార్లర్ హోమ్ రెమిడిలను ఫాలో అవుతూ

  • Written By:
  • Publish Date - September 17, 2023 / 09:45 PM IST

చాలామంది అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవడానికి చర్మం మెరిసిపోయేలా చేసుకోవడానికి ఎన్నో రకాల బ్యూటీ పార్లర్ హోమ్ రెమిడిలను ఫాలో అవుతూ ఉంటారు. మరి ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్లకు ఈవెంట్లకు పెళ్లి ఇలాంటి వేడుకలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు పార్టీలో అందరికంటే మరింత కనిపించాలని స్కిన్ మెరిసిపోవాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీ స్కిన్ రెండు వారాల్లోనే స్కిన్ మెరిసిపోవాలంటే ఈ జ్యూస్ తాగాల్సిందే అంటున్నారు వైద్యులు. రెండు వారాల్లో మీ చర్మాన్ని మెరిసేలా చేసే ఒక జ్యూస్ ఉంది. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకొని ప్రతి రోజూ తాగితే చాలు. రెండు వారాల్లో మీకు మెరిసే చర్మం సొంతమవుతుంది.

ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి? ఆ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలి అన్న వివరాల్లోకి వెళితే.. ఆ జ్యూస్ కోసం ముందుగా దోసకాయను తీసుకొని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పుదీనా ఆకులను కూడా తీసుకోవాలి. ఉసిరికాయ ముక్కలు, అర స్పూను జీలకర్ర పొడి, నిమ్మరసం, నీరు రెడీగా ఉంచుకోవాలి. ఈ పదార్థాలన్నింటినీ మిక్సీలో వేసి జ్యూస్‌లా చేసుకోవాలి. వాటిని పరగడుపున తాగేయాలి. ఇలా మీరు రెండు వారాలు చేస్తే చాలు, మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. దీనిని వెజిటేబుల్ జ్యూస్ అంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది. చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి, చర్మం యవ్వనంగా ఉండేలా చూస్తుంది.

ఇందులోని విటమిన్ సి సూర్యరశ్మి, పర్యావరణ కారకాలు చర్మాన్ని రక్షిస్తుంది. విటమిన్ సి ఇక్కడ ఒక యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అది శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. కూరగాయల రసంలో నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. కేవలం చర్మానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఈ రసం ఎంతో ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి జీర్ణక్రియ సులభంగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల శరీరం శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాదు. కేవలం ఈ రసమే కాదు, బీట్రూట్ రసం, పాలకూర జ్యూస్ కూడా చర్మాన్ని నేర్పించడానికి ముందుంటాయి. ఈ జ్యూస్‌ను తాగుతూ రాత్రిపూట 8 గంటలు కచ్చితంగా నిద్ర పోవాలి. అప్పుడే చర్మం మెరుస్తూ ఉంటుంది. ఈ రసంలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, క్యాల్షియం, సోడియం వంటివి నిండుగా ఉంటాయి. ఫైబర్ కూడా దీనిలో అధికంగా ఉంటాయి. ఈ జ్యూస్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. స్కిన్ ఆరోగ్యానికి ఈ గ్రీన్ డ్రింక్ చాలా అవసరం.