Site icon HashtagU Telugu

Face Pack : యంగ్ గా కనిపించాలా? ఈ ఫేస్ ప్యాక్ మీకోసమే..!

Coffee Face Pack

Coffee Face Pack

ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే బాడీ మొత్తం యాక్టివ్‌ (Active) అవుతుంది. శరీరాన్ని ఉత్తేజ పరచి, రోజు మొత్తం ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కాఫీ (Coffee) అందాన్ని రెట్టింపు చేసుకోవడానికీ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీని ఫేస్ ప్యాక్ (Coffee Face Pack) ల దరించడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants), యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-Inflammatory) గుణాలు మొటిమలు (Pimples), దద్దుర్లను (Rashes) దూరంగా ఉంచుతాయి. యాంటీ ఏజెనింగ్‌ (Anti Aging) గా పనిచేయడంతోపాటు ముఖంపై మచ్చలు (Spots), నల్లటి వలయాలను (Dark Circles) తొలగిస్తాయి. కాఫీతో మీ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో చూదాం..

డెడ్‌ సెల్స్‌ తొలగుతాయి:

కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్‌ గా పనిచేస్తుంది. స్నానం చేసే సమయంలో కాఫీపొడిని నేరుగా చర్మంపై రుద్దుకోండి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగుతాయి. స్క్రబింగ్ కోసం కాఫీ గింజలను కూడా వాడొచ్చు. కాఫీ పొడిలో చిన్న పలుకుల పంచదార, రోజ్‌ వాటర్‌ వేసి కూడా ముఖాన్ని స్క్రబ్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.

ముడతలు మాయం:

కాఫీ పొడిలో యాంటీ ఏజింగ్‌ గుణాలు మెండుగా ఉంటాయి. మీ ముఖంపై ముడతలను పోగొట్టుకోవాలంటే, కాఫీ పొడిలో టీట్రీ ఆయిల్, కొన్ని చుక్కల నీరు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌ (Face Pack) లా అప్లై చేసుకోండి. ఈ ప్యాక్‌ తో చర్మం బిగుతుగా మారడంతో పాటు, చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌ తొలగుతాయి.

డార్క్‌ సర్కిల్స్‌ కు చెక్‌ పెట్టండి:

ఈ రోజుల్లో డిజిటల్స్‌ స్క్రీన్స్‌ ఎక్కువగా వాడటం, నిద్ర లేమి, బిజీ లైఫ్‌ స్టైల్‌ కారణంగా కంటి కింద డార్క్‌ సర్కిల్స్‌ సమస్యతో ఎక్కువమంది బాధపడుతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి కాఫీ ఎఫెక్టివ్‌ గా పని చేస్తుంది. కళ్ల చుట్టూ కాఫీ డికాక్షన్‌ ను రుద్దితే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. కాఫీలోని విటమిన్‌ ‘కె’ కళ్లను రిలాక్స్‌ చేస్తాయి. దీనిలో ఉండే కెఫిన్‌ కళ్ల కింద చర్మాన్ని బిగుతుగా, గ్లోగా చేస్తాయి.

ముఖాన్ని మెరిపించండి:

జిడ్డు చర్మం ఉన్నవారు కాఫీ డికాక్షన్లో కొద్దిగా పెరుగు, శెనగపిండి కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌ (Face Pack) లా అప్లై చేసుకుని, పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. దీనివల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం బిగుతుగా తయారవుతుంది. పిగ్మెంటేషన్ సమస్య కూడా దూరమవుతుంది.

మొటిమలు తొలగుతాయి:

ఈ మధ్య కాలంలో మొటిమల సమస్య అందరినీ బాధిస్తుంది. ఇందుకోసం కాఫీకి ఆలివ్ ఆయిల్ ని జోడించి ఆ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రపరిస్తే మొటిమల బాధ తగ్గుతుంది.

Also Read:  Skin Health Tips : మీ స్కిన్ మెరిసిపోవాలంటే ఇలా చేయండి..

Exit mobile version