Site icon HashtagU Telugu

Walking: నడకే మనిషికి మంచి ఆరోగ్యం

Running In Winter

Walking Backwards

Walking: ఎక్సర్‌సైజుల్లో నడకను మించిన తేలికపాటి వ్యాయామం మరొకటి లేదు. ఏ వయస్సు వారైనా ఎప్పుడైనా ఎక్కడైనా నడకను కొనసాగించొచ్చు. దీనికోసం పైసా ఖరుచ పెట్టనక్కరలేదు. మిగతా వ్యాయామాల కన్నా సురక్షితం కూడా. నడక వల్ల బరువు తగ్గటంతోపాటు ఎన్నో ఉపయోగాలు, మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజూ నడవటం వల్ల శరీరంలో ఉండే ఎండార్ఫిన్లు అనే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. వయస్సు మీద పడటం వల్ల వచ్చే డెమన్షియా, అల్జీమర్స్‌ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.

కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లలో ఉంటాయి. అందుకనే కాళ్లతో నడవటం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నిత్యం నడక సాగించటం వల్ల కళ్లపై అధిక ఒత్తిడి తగ్గటంతోపాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ నడిచినా, పరుగెత్తినా గుండె సమస్యలు తగ్గుతాయి. గుండెపోట్లు వంటివి రావు. హైబీపీ, కొలెస్ట్రాల్‌ వంటివి కూడా తగ్గుముఖం పడతాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది.

నడవటం వల్ల శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. అదే ఆక్సిజన్‌ రక్తంలో చేరి ఊపిరితిత్తులకు చేరి శరీరం ఆక్సిజన్‌ను గ్రహిస్తుంది. ఆక్సిజన్‌ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. ఇతర ఊపిరితిత్తుల సమస్యలు కూడా దూరమవుతాయి. మధుమేహం ఉన్న వారు నిత్యం నడిస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆరునెలలపాటు క్రమం తప్పకుండా నడక లేదా పరుగు చేసిన కొందరు మధుమేహ రోగులను పరిశీలించగా వారి రక్తం స్థాయిలో గ్లూకోజ్‌ స్థాయిలో బాగా అదుపులోకి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. అందువల్ల రోజూ నడిస్తే మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.