Winter Tips : శీతాకాలంలో వాకింగ్ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే..

వాకింగ్ చేయడం అన్నది మంచి అలవాటే అయినప్పటికీ చలికాలంలో (Winter) అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు.

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 07:40 PM IST

Walking Tips in Winter : ఉదయం సమయంలో వాకింగ్ (Walking) చేయడం అన్నది ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వాకింగ్ చేయడం అన్నది మంచి అలవాటే అయినప్పటికీ చలికాలంలో (Winter) అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు. ఎందుకంటే చలికాలంలో ఉదయం సమయంలో విపరీతమైన చలి ఉంటుంది. చుట్టూ ఎక్కడ చూసినా మంచు కురుస్తూ ఉంటుంది. ఉదయం చాలా చలిగా ఉంటుంది. కావున వాకింగ్ కోసం ఉదయం వెళ్లేవారు కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. మరి చలికాలంలో వాకింగ్ (Walking in Winter) చేసే వాళ్ళు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

చలికాలంలో బయటికి వెళ్లి రన్నింగ్, వాకింగ్ కొన్ని రకాల వ్యాయామలు చేసేవాళ్ళు అలాగే క్రీడల కోసం ప్రాక్టీస్ చేసేవాళ్ళు మార్నింగ్ వాక్ కి వెళ్లి ఎక్సర్సైజులు చేసేవాళ్ళు, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చలిలో బయటికి వెళ్లేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లటి వాతావరణం వలన చర్మం పగలడం, జలుబులు లాంటి సహజమైన అనారోగ్య సమస్యల నుండి మొదలవుతాయి. తర్వాత శ్వాస కోసం సమస్యలు, నిమోనియా, డిప్రెషన్ గుండెపోటు లాంటివి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఈ చలికాలంలో గాలిలో అయితే త్వరగా తగ్గవు కాబట్టి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు సరిగా నిద్ర పోయారా మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించిందా అనేది మీరు గమనించుకోవాలి.

సరైన విశ్రాంతి లేక కొండ అభ్యాసాలు చేస్తే అస్తవ్యస్తకు గురవుతూ ఉంటారు. ఆస్తమా లేదా కొన్ని శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతుంటే సమయానికి మందులు తీసుకోవాలి. ఏదైనా వ్యాయామం మొదలు పెట్టేటప్పుడు వామప్ చేయడం చాలా ముఖ్యం. ఈ వామప్ ప్రధాన పాత్రను పోషిస్తుంది. సిరియా అంతర్గత ఉష్ణోగ్రతను పెంచి మీ ముఖ్య కీళ్లలో చలనశీలతను కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా కండరాలను సక్రీయం చేసే సౌకర్యంగా శరీరాన్ని కదిలించగలిగే సిబిలిటీని అందిస్తుంది. శరీరం తగినంత గా వేడెక్కించడం వలన అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే చలిలో ఇది చాలా ప్రధానమైనది. చలికాలంలో పొట్టిగా ఉండే బట్టలు కాకుండా నిండుగా ఉండే బట్టలు ధరించాలి. ఎగువ దిగువ శరీరాలను కప్పి ఉండేలా లోపల నుంచి ఒక లేయర్ ధరించాలి. పైనుంచి వదులుగా ఉండే లా వేసుకోవడం చాలా మంచిది. మెడ ప్రాంతాన్ని కప్పి ఉంచి మందమైనా బిన్ను బ్రేకర్ స్టైల్ జాకెట్లు దారించుకోవాలి. మీ శరీరం వేడెక్కడం మొదలుపెట్టినప్పుడు పై లేయర్ దుస్తులు తొలగించవచ్చు. అలాగే పాదాలకు సాక్షులు, చేతులకి గ్లౌజులు, చెవులని కప్పి ఉంచే దుస్తుల్ని వేసుకోవాలి.

Also Read:  Cloves: లవంగంతో ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. ఆర్థిక ఇబ్బందులు మాయం అవ్వాల్సిందే?