శాఖాహారం(Vegetarian Food) తింటే ఆయురారోగ్యాలకు(Good Health) మూలం అని మన పూర్వీకులు చెప్పేవారు. ఎక్కువ రోజు బతకాలంటే ఉండాలంటే శాఖాహారమే కారణం. కూరగాయలు(Vegetables), ఆకుకూరలు(Green Leaves), పండ్లు(Fruits), పప్పుదినుసులు తినేవారు ముసలివాళ్ళు అయినా కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కువమంది శాఖాహారులు ఉన్నారు అనే సర్వే ని వరల్డ్ యానిమల్ ఫౌండేషన్ తాజాగా నిర్వహించారు.
భారతదేశంలో ఎక్కువమంది శాఖాహారులు ఉన్నారు అని ఈ సర్వే వలన తెలిసింది. 2022-2023లో జరిపిన సర్వే ప్రకారం భారతదేశంలోని జనాభాలో నాలుగింట ఒక వంతు శాఖాహారులు ఉన్నారు. అంటే 25 శాతం శాఖాహారులు ఇండియాలో ఉన్నారు. ఈ సర్వే ప్రకారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఐదు శాతం మాత్రమే శాఖాహారులు ఉన్నారు. ఇజ్రాయిల్ దేశంలో పదమూడు శాతం మంది శాఖాహారులు ఉన్నారు. తైవాన్ లో పన్నెండు శాతం మంది శాఖాహారులు ఉన్నారు. ఇటలీలో పది శాతం మంది శాఖాహారులు ఉన్నారు.
జర్మనీ మరియు UKలో తొమ్మిది శాతం మంది శాఖాహారులు ఉన్నారు. బ్రెజిల్ లో ఎనిమిది శాతం మంది శాఖాహారులు ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఐదు శాతం మంది శాఖాహారులు ఉన్నారు. అన్ని దేశాలతో పోలిస్తే మన భారతదేశంలోనే ఎక్కువ మంది శాఖాహారులు ఉన్నారు. ఇతర దేశాలలో ఐదు లేదా పది లేదా పదిహేను శాతం మంది మాత్రమే శాఖాహారులు ఉన్నారు.
Also Read : Arthritis in Winter : శీతాకాలంలో నొప్పులు వేధిస్తున్నాయా.. వెంటనే ఇలా చేయండి?