Site icon HashtagU Telugu

Vegetable Paratha: డిఫరెంట్ గా ఉండే వెజిటేబుల్ పరాటా.. ట్రై చేయండిలా?

Vegetable Paratha

Vegetable Paratha

మామూలుగా మనం వెజిటేబుల్ రైస్ వెజిటేబుల్ పులావ్ అంటూ కొత్త కొత్త వెరైటీ వంటకాలు ట్రై చేస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైనా కూడా వెజిటబుల్ పరాఠా ట్రై చేశారా? ఒకవేళ ఎప్పుడూ తినకపోతే ఇంట్లోనే ఈ వెజిటబుల్ పరాఠా ఎలా తయారు చేసుకోవాలి?అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వెజిటబుల్ పరాఠాకి కావలసిన పదార్థాలు:

గోధుమపిండి -1 కప్పు
బంగాళాదుంప – 1
క్యారెట్ ముక్కలు – అరకప్పు
కాలీఫ్లవర్ ముక్కలు – పావుకప్పు
పచ్చి బఠాణీ – పావుకప్పు
సన్నగా తరిగిన పాలకూర – పావుకప్పు
కొత్తిమీర – పావుకప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – అరచెంచా
కారం – అరచెంచా
గరం మసాలా – అరచెంచా
వాము – అరచెంచా
ఉప్పు – తగినంత
నూనె లేక నెయ్యి – సరిపడా

వెజిటబుల్ పరాఠా తయారీ విధానం:

మొదట గోధుమపిండిలో నీళ్లు వేసి చపాతీ పిండి మాదిరిగా కలిపి, ఒక అరగంట పాటు అలా వదిలేయాలి. ఈలోపు బంగాళాదుంపను ఉడికించి, తొక్క తీసి, మెత్తగా చిదుముకోవాలి. మిగతా కూరగాయలన్నికీ నీటిలో వేసి మెత్తగా ఉడికించాలి. తర్వాత వాటన్నిటికీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బంగాళాదుంప, కూరగాయల ముద్దలో నూనె లేదా నెయ్యి తప్ప మిగతా పదార్థాలన్నింటినీ వేసి కలపాలి. గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీల మాదిరిగా ఒత్తుకోవాలి. దీని మధ్యలో పై మిశ్రమాన్ని పెట్టి, అన్ని వైపుల నుంచీ మూసివేసి, మళ్లీ ఉండ చుట్టాలి. దీన్ని మళ్లీ ఒత్తుకుని నూనె లేక నెయ్యి వేసి కాల్చుకోవాలి.

Exit mobile version