మామూలుగా ఇంట్లో పిల్లలు ఎప్పుడూ ఒకే విధమైన వంటలు కాకుండా కొత్త కొత్త వంటలు తినాలని, ఇంట్లో అమ్మలను కొత్త వంటకాలు చేయమని విసిగిస్తూ ఉంటారు. ఇక అమ్మలు ఎప్పుడు చేసే వంటలు కాకుండా కొత్త వంటకాలు ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా అలా ఏదైనా కొత్తగా వంటకం చేయాలని చూస్తున్నారా. అయితే పిల్లలు ఎంతగానో ఇష్టపడే వెజిటేబుల్స్ ఇంట్లోనే సింపుల్ గా ట్రై చేయండిలా
కావాల్సిన పదార్థాలు:
ఉప్మా రవ్వ – ఒక కప్పు
నీళ్లు – అరకప్పు
క్యాప్సికం – ఒకటి
కొత్తిమీర – ఒక కట్ట
పెరుగు – అరకప్పు
క్యారెట్ – ఒకటి
ఉల్లిపాయ – ఒకటి
నల్ల మిరియాల పొడి – అర స్పూను
ఆయిల్ – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం :
ఇందుకోసం ముందుగా ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికం, కొత్తిమీర వంటి కూరగాయలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్మా రవ్వని వేయండి. దానిలో పెరుగు, నీళ్లు వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, నల్ల మిరియాల పొడి కూడా వేసి కలపితే పిండి సిద్ధమవుతుంది. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న కూరగాయల తరుగును ఇందులో వేసి బాగా కలపి పావుగంట సేపు పక్కన పెట్టాలి. అవసరం అయితే మరి కొంచెం నీరు కలుపుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి ఊతప్పం వేసినట్టు ఈ పిండిని కాస్త లావుగా అట్టులా వేయాలి. బంగారు గోధుమరంగు వచ్చేవరకు రెండు వైపులా కాల్చాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్స్ పాన్ కేక్ రెడీ.