Vastu Tips: భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తున్నాయా.. అయితే ఈ వాస్తు చిట్కాలను పాటించండి?

భార్య భర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. కొందరు గొడవపడిన వెంటనే ప్రేమతో కలిసి పోతూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
Vastu Tips

Vastu Tips

భార్య భర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. కొందరు గొడవపడిన వెంటనే ప్రేమతో కలిసి పోతూ ఉంటారు. మరికొందరు మాత్రం గొడవలన్నీ మరింత పెద్దదిగా చేసుకుంటూ వారి మధ్య దూరాన్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉంటే వాటికి వాస్తుదోషం కూడా కారణం కావచ్చు. మరియు తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే ఇటువంటి వార్త చిట్కాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మొదట భార్యాభర్తల మధ్య సరైన క్లారిటీ లేకపోవడం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి.

దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు వాస్తు ప్రకారంగా ఇంటికి ఈశాన్యం మూలలో పర్పుల్ లేదా బ్లూ కలర్ వస్తువులను అమర్చాలి. లేకపోతే ఈశాన్యం మూలలో పర్పుల్ లేదా బ్లూ కలర్ రంగు వేయడం మంచిది. భార్యాభర్తల మధ్య గొడవలకు బెడ్రూంలోని బెడ్ పొజిషన్ కూడా కారణం అవ్వవచ్చు. అటువంటప్పుడు వాస్తు ప్రకారంగా ఇంట్లో బెడ్ ను దక్షిణ దిశలో లేదా నైరుతి దిశలో ఉంచాలి. చాలామంది బెడ్రూంలో ఇనుముతో తయారు చేసిన బెడ్స్ ని వాడుతూ ఉంటారు. అలాంటి వాడటం వల్ల దంపతుల మధ్య సమస్యలు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి.

కాబట్టి మెటల్ బెడ్స్ కి కాకుండా చెక్క మంచం మాత్రమే వాడాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఇంటిని నచ్చినట్టుగా అలంకరించుకుంటూ నచ్చిన కలర్స్ వేయించుకుంటూ ఉంటారు. కానీ ఇంటి గోడలకు ముదురు రంగులు వేయడం వల్ల కూడా దంపతుల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో గోడలు ఎప్పుడూ లైట్ కలర్ పెయింట్స్ వేసుకోవడం మంచిది.

  Last Updated: 13 Oct 2022, 12:12 AM IST