Vasthu Tips: ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచితే ఏం జరుగుతుందో తెలుసా?

ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడం కోసం ఇప్పటికే ఎన్నో రకాల విషయాలను వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ క్రమంలోని

  • Written By:
  • Publish Date - November 6, 2022 / 08:30 AM IST

ఆర్థిక పరిస్థితి మెరుగవ్వడం కోసం ఇప్పటికే ఎన్నో రకాల విషయాలను వాస్తు శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఈ క్రమంలోని వాస్తు ప్రకారం గా కొన్ని రకాల వస్తువులు కొన్ని రకాల విగ్రహాలు అలాగే మొక్కలను నాటడం వల్ల వాస్తు ప్రకారంగా కలిసి వస్తుంది అని ఆ ప్రకారంగా వాటిని మన ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే మరి వాస్తు శాస్త్ర ప్రకారం గా తాబేలు కూడా ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలామంది ఇళ్లల్లో ఆఫీసులలో అలాగే వ్యాపార ప్రదేశాలలో స్పటికం రాగి లోహం వెండి ఇలా మొదలైన వాటితో తయారు చేసిన తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటూ ఉంటారు.

ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆనందంగా ఉండడంతో పాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మరి తాబేలు ఇంట్లో ఏ దిశలో ఉంచాలి అన్న విషయానికి వస్తే.. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని పౌర్ణమి రోజున మాత్రమే ఇంట్లోకి తీసుకురావడం శుభప్రదంగా చెప్పవచ్చు. పౌర్ణమి రోజు తాబేలును కొద్దీసేపు పాలలో ముంచి ఉంచాలి. ఆ తరువాత మంచి ముహూర్తంలో ఈ తాబేలును పాలలో నుండి తీసి, నీటితో పూర్తిగా శుభ్రం చేసి ఒక గిన్నెలో కొంచెం నీరు తీసుకుని అందులో తాబేలు పెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల తాబేలు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుంది.

అయితే తాబేలు నీటిలో నివసించే జంతువు కాబట్టి తాబేలు ఉంచాల్సిన పాత్రను కూడా నీటి దిశలో అనగా ఈశాన్య దిశలో ఉంచాలి. ఆ తరువాత ఓం శ్రీ కూర్మై నమః మంత్రాన్ని 11 సార్లు జపించాలి. అలాగే తాబేలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకునేటప్పుడు తాబేలు నోరు లోపలికి ఉండే విధంగా చూసుకోండి. అనగా ఇంటి నుంచి బయటకు వెళ్లే దేశంలో తాబేలు ముఖాన్ని ఉంచకూడదు. ఈ విధంగా చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. తాబేలు విగ్రహాన్ని ఇంట్లో ఉంచడం వల్ల అనుకున్న పనులు సాధించడంతోపాటు, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది.