Vastu Tips For Bathing: స్నానం చేసే నీటిలో ఈ 5 వస్తువులను కలిపితే.. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయట..!

  • Written By:
  • Publish Date - June 18, 2024 / 06:30 AM IST

Vastu Tips For Bathing: ప్రతి వ్యక్తి దినచర్యలో స్నానం చేయడం మొదటి పని. చాలా మంది ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసిన తర్వాతే ఇంటి నుంచి బయటకు వస్తుంటారు. ఇది మీ ఆరోగ్యానికి కూడా మంచిది. జ్యోతిష్యం నుండి వాస్తు శాస్త్రం వరకు.. స్నానం చాలా ముఖ్యమైనదిగా (Vastu Tips For Bathing) తెలుపుతుంది. ఇది వ్యక్తికి భగవంతుని అనుగ్రహాన్ని ఇస్తుంది. మీరు మీ కెరీర్‌లో ఆర్థిక పరిమితులు, వైఫల్యాలు, ఇతర సమస్యలతో పోరాడుతున్నట్లయితే మీరు స్నానం చేసేటప్పుడు ఈ వస్తువులను నీటిలో వేసి స్నానం చేయవచ్చు. వీటిని నీటిలో వేసి స్నానం చేయడం వల్ల ఆ మనిషికి అదృష్టం వస్తుందని నమ్మకం. జీవితంలో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని, అడ్డంకులు ఆటోమేటిక్‌గా తొలగిపోతాయని.. ఆనందం, శాంతితో పాటు శ్రేయస్సు ఇంట్లో ఉంటుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

వాస్తు ప్రకారం.. స్నానం చేయడం వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వ్యక్తి తాజాగా అనుభూతి చెందుతాడు. దీని ప్రభావం మిమ్మల్ని మానసికంగా కూడా సానుకూలంగా భావించేలా చేస్తుంది. మీరు స్నానం చేసే ముందు వాస్తు ప్రకారం నీటిలో ఐదు వస్తువులను వేయండి. ఆ తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల వ్యక్తిపై సానుకూల ప్రభావం ఉంటుంది. ఇంటి నుంచి ఆర్థికాభివృద్ధికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. మనిషి సమస్యలు క్రమంగా దూరమవుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం ఏయే వస్తువులు నీటిలో కలిపి స్నానం చేస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం.

Also Read: Kavach Safety System: రైల్వేలో కవాచ్ రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?

ఆకుపచ్చ యాలకులు- కుంకుమపువ్వు

మీరు చాలా కాలంగా ఏదైనా కారణాల వల్ల లేదా మరేదైనా సమస్యల వలన జీవితంలో సంక్షోభం, ఇబ్బందులు పడుతున్నట్లైతే ప్రతిరోజూ స్నానం చేయడానికి ముందు 2 నుండి 3 ఏలకులను నీటిలో వేయండి. వీటితో పాటు చిటికెడు కుంకుమపువ్వు వేయండి. ఆ తర్వాత ఈ నీటితో స్నానం చేయాలి. ఈ ఒక్క రెమెడీని క్రమం తప్పకుండా చేయడం వల్ల ప్రతికూలత నశిస్తుంది. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలు క్రమంగా ముగుస్తాయి.

రత్నం

వాస్తు శాస్త్రంలో రత్నాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక వ్యక్తి గ్రహం బలహీనంగా ఉంటే లేదా దోషం ఉన్నట్లయితే జ్యోతిషశాస్త్ర సలహా ప్రకారం రత్నాన్ని ధరించాలి. దీంతో జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి. అదే సమయంలో స్నానం చేసే నీటిలో రత్నాలను ఉంచి స్నానం చేయడం వల్ల వ్యక్తి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇలా చేస్తే ఆ వ్యక్తి జీవితంలో ఐశ్వర్యం వస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

నువ్వులు

వాస్తు శాస్త్రంలో నువ్వులకు చాలా ప్రాముఖ్యత ఉంది. శని అనుగ్రహం కోసం నువ్వులను కూడా సమర్పిస్తారు. మీరు కూడా శని గ్రహ స్థితితో బాధపడుతున్నట్లయితే స్నానం చేసే ముందు నీటిలో కొన్ని నువ్వులు వేయండి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల శని గ్రహం చెడు దృష్టి తొలగిపోతుంది. ఒక వ్యక్తి జీవితంలో లాభం, అదృష్టం కలిసి వస్తాయి.

పసుపు

ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా పసుపును పూజలో కూడా ఉపయోగిస్తారు. గురుగ్రహానికి పసుపు చాలా ప్రీతికరమైనది. ఇటువంటి పరిస్థితిలో గురువారం స్నానం చేసే ముందు నీటిలో కొద్దిగా పసుపు కలపండి. ఆ తర్వాత నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి. అదృష్టం వరిస్తుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో సంపదల భాండాగారం నిండిపోతుంది.

నెయ్యి

మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే స్నానం చేసే ముందు నీటిలో కొంచెం నెయ్యి కలపండి. దీని తర్వాత స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. చర్మ సంబంధిత రుగ్మతలు దూరమై గ్రహాలు బలపడతాయి.