Vastu Tips: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయా.. అయితే ఇలా చేయండి?

అంగట్లో అన్ని ఉన్నా.. అల్లుడు నోట్లో శని ఉన్నట్లు.. అనే సామెత చెబుతూ ఉంటారు. అయితే ఆర్థికంగా అన్ని రకాలుగా

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 06:50 AM IST

అంగట్లో అన్ని ఉన్నా.. అల్లుడు నోట్లో శని ఉన్నట్లు.. అనే సామెత చెబుతూ ఉంటారు. అయితే ఆర్థికంగా అన్ని రకాలుగా బాగానే ఉన్నప్పటికీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి అంటే అందుకు వాస్తు శాస్త్ర ప్రకారం కారణం కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు. వాస్తు ప్రకారం గా అనుకూలంగా లేనప్పుడు కూడా ఇంట్లో తలుచుగా మనస్పర్ధలు గొడవలు జరుగుతూనే ఉంటాయి. అటువంటప్పుడు ప్రతికూల శక్తిని తొలగించడంలో కర్పూరం చాలా బాగా పనిచేస్తుంది అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు..

ఇంట్లో తరచూ కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఆ కుటుంబంలో ఆనంద శ్రేయస్సు అలాగే శాంతి నెలకు ఉంటుంది అని చెబుతున్నారు శాస్త్ర నిపుణులు.ఇంట్లో పూజ చేసిన తర్వాత కర్పూరం వెలిగించి హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందనిచెబుతున్నారు. కర్పూరం వాసన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. అలాగే ఇంట్లో మనసును ప్రశాంతంగా ఉంచడంలో కర్పూరం బాగా పనిచేస్తుంది అంటున్నారు శాస్త్ర నిబంధనలు. దీనివల్ల మనస్పర్ధలు తక్కువగా చూడచేసుకుంటాయని చెబుతున్నారు.

అదేవిధంగా ఇంట్లో భార్యా భర్త ల మధ్య వైవాహిక బంధంలో విభేదాలు సమస్యలు ఎదురైతే అటువంటి వారు పడక గదిలో రోజు వెండి లేదా ఇత్తడి గిన్నెలో కర్పూరాన్ని వెలిగించాలని సలహా ఇస్తున్నారు. అంతేకాకుండా గది మూలన రెండు కర్పూరా లను ఉంచడం వల్ల మంచిది చెబుతున్నారు. అదేవిధంగా ఇంటిలో సాయంత్రం పూట ఆగ్నేయంలో కర్పూరస్పటికాలను కాల్చడం వల్ల శ్రేయస్సు లభిస్తుంది.. అలాగే నెయ్యితో ఎప్పుడు అన్ని కాల్చడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.