Vastu Tips: బాత్రూమ్, కిచెన్ కి కూడా వాస్తు శాస్త్రం అవసరమా.. శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారంటే?

వాస్తు శాస్త్ర ప్రకారంగా కేవలం ఇంటిని నిర్మించడం మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే వస్తువులు, అలాగే బాత్రూం కిచెన్,

  • Written By:
  • Publish Date - November 4, 2022 / 06:30 AM IST

వాస్తు శాస్త్ర ప్రకారంగా కేవలం ఇంటిని నిర్మించడం మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే వస్తువులు, అలాగే బాత్రూం కిచెన్, పూజ గది,బెడ్ రూమ్, విషయాలను కొన్ని రకాల వాస్తు చిట్కాలను తప్పకుండా పాటించాలి. అయితే వాస్తు శాస్త్ర ప్రకారంగా ఒకవేళ బాత్రూమ్, కిచెన్ ని నిర్మించకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బాత్రూం వాస్తు విషయానికి వస్తే.. బాత్రూంలో ఎప్పుడూ కూడా ఖాళీ బకెట్ ఉంచకూడదు. ఇలా బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి బాత్రూంలో ఎప్పుడూ నీటితో నింపిన బకెట్ ను మాత్రమే పెట్టాలి.

అలాగే బాత్రూంలో నీటితో నింపిన బ్లూ కలర్ బకెట్ ను పెట్టడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం నీలిరంగును ఆనందం పవిత్రతకు సంకేతంగా భావిస్తారు. కాబట్టి బాత్రూంలో నీలిరంగు టైల్స్ ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే కిచెన్ వాస్తు విషయాల విషయానికొస్తే.. వాస్తు శాస్త్ర ప్రకారం ఎప్పుడు ఆరెంజ్ ఎల్లో గ్రీన్ వంటి రంగులు కిచెన్ రూమ్ కి మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఎప్పుడు కూడా కిచెన్ రూమ్ లో డార్క్ గ్రే, బ్రౌన్ బ్లాక్ వంటి రంగులను కిచెన్ లో వేయకూడదు.

ఇవి పాజిటివ్ ఎనర్జీ నాశనం చేస్తాయి. అలాగే కిచెన్ కూడా ఎప్పుడు నైరుతి మూలలో ఉండాలి. నీరు, అగ్ని పరస్పర విరుద్ధ అంశాలు కాబట్టి వాష్ బేసిన్స్, కుకింగ్ వస్తువులైన గ్యాస్ సిలెండర్, ఓవెన్ ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఉంచకూడదు. శాస్త్ర ప్రకారంగా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలి అంటే వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంచాలి.