Vasthu Tips: ఇంటి ఈశాన్య భాగంలో ఇలా చేస్తే చాలు.. ఇంట్లో ధన ప్రవాహమే?

ప్రతి ఒక్కరూ మంచి స్థాయికి ఎదగాలని, డబ్బు సంపాదించాలని ఇతరుల కంటే మంచి స్థాయిలో ఉండాలి అని

  • Written By:
  • Updated On - November 10, 2022 / 10:23 AM IST

ప్రతి ఒక్కరూ మంచి స్థాయికి ఎదగాలని, డబ్బు సంపాదించాలని ఇతరుల కంటే మంచి స్థాయిలో ఉండాలి అని కష్టపడటం కోసం అనేక రకాల మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతులో నిలవడం లేదు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి అని బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది డబ్బు సంపాదిస్తూ లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండడం కోసం కొన్ని రకాల పూజలు అలాగే వాస్తు చిట్కాలను కూడా పాటిస్తూ ఉంటారు. ప్రస్తుతం జీవించాలి అంటే డబ్బు అన్నది ప్రధానంగా మారిపోయింది.

అయితే ఎంత డబ్బు సంపాదించినా నిలవకపోతే కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించడం మంచిది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇంట్లో దక్షిణం దిక్కు వైపు కాస్త ఎత్తు ఉండేలా చూసుకోవాలి. లేదంటే దక్షిణం వైపు ఎత్తు సమానంగా అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి ఈశాన్య భాగంలోని ఉత్తరం వైపు డోర్ ఉండేలా చూసుకోవాలి. దీని ద్వారా ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు పెరుగుతాయి.

అదేవిధంగా ఈశాన్యం, తూర్పు ద్వారాన్ని తెరిచి ఉంచడం వల్ల మంచి పేరు ప్రతిష్టలతో పాటు ధనప్రాప్తి ఉంటుంది. ఈశాన్యంలో నీటి నిల్వ ఉంచుకునే సంప్ గుంత ఉండడం మేలు. దీంతో డబ్బుతో పాటుగా ఆ ఇంటిలో శాంతి ఉంటుంది. అలాగే భారీగా బరువు ఉండే వస్తువులను దక్షిణ, నైరుతి వైపు ఉంచడం వల్ల ఇంట్లోకి డబ్బు వచ్చే మార్గాలు మరింత పెరుగుతాయి. కాగా అపార్ట్‌మెంట్ దక్షిణం వైపు ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.