Vasthu Tips: వెదురు మొక్కను ఆ దిశలో నాటితే ఇక కాసుల వర్షమే?

ప్రస్తుతం రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీంతో ఇంటి నిర్మాణం నుంచి

  • Written By:
  • Publish Date - October 30, 2022 / 08:30 AM IST

ప్రస్తుతం రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. దీంతో ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో పెంచుకునే మొక్కల వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు శాస్త్రాన్ని పాటిస్తున్నారు. అయితే చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం గా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో ఆనందాలు అష్టైశ్వర్యాలు ఉండాలి అని అనేక రకాల మొక్కలను వాస్తు శాస్త్ర ప్రకారంగా పెంచుతూ ఉంటారు. అలాగే వెదురు మొక్కను కూడా వాస్తు శాస్త్ర ప్రకారంగా పెంచుకోవాలి. ఇంట్లో వెదురు మొక్కను పెంచుకోవడం వల్ల విజయాలు సిద్ధించడంతోపాటు ఆ ఇంట్లోని వారు ఆరోగ్యంగా ఉండి అంతా మంచి జరుగుతుంది. మరి వెదురు మొక్కను ఏ దిశలో నాటాలి? అందువల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాస్తు శాస్త్ర ప్రకారం వెదురు మొక్కను ఎప్పుడూ కూడా తూర్పు వైపున ఉంచాలి.. అలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం ఉండడంతో పాటు అదృష్టం అన్నది వెంటే ఉంటుంది. వెదురు మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆ మొక్కను చూసినప్పుడు మనసుకు ఆహ్లాదంగా అనిపించడంతోపాటు అది కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. వాస్తు శాస్త్ర ప్రకారంగా వెదురు మొక్కలు పాజిటివ్ ఎనర్జీని తెస్తాయి. ఈ వెదురు మొక్కలను ఇంట్లో ఆఫీసులలో వ్యాపార ప్రదేశాలలో తూర్పు వైపున ఉంచడం వల్ల మంచి జరుగుతుంది. సూర్యుడు మనకు తూర్పు దిక్కున ఉదయిస్తాడు అన్న విషయం తెలిసిందే. చాలా మంచి ప్రతిరోజు సూర్యునికి ఉదయాన్నే నమస్కారం చేస్తూ ఉంటారు.

అటువంటి వారు వెదురు మొక్కను తూర్పు వైపున నాటడం వల్ల ఆ చెట్టు పచ్చదనాన్ని చూస్తూ మానసికంగా ఆనందాన్ని పొందవచ్చు. అంతేకాకుండా వెదురు మొక్కను తూర్పు వైపున నాటడం వల్ల ఆ ఇంట్లో శాంతి నిలకనడంతో పాటు వివాదాలు జరగకుండా బంధాలు కూడా దగ్గరగానే ఉంటాయి. అలాగే విధులు చెట్టును తూర్పు వైపున నాటడం వల్ల మనం చేసే పనులపై మనం శ్రద్ధ వహించడంతోపాటు మనసుకు ఆహ్లాదకరంగా అనిపించి మనం చేయవలసిన పనిని సక్రమంగా పూర్తి చేయగలుగుతాం. మరి ముఖ్యంగా ఆఫీసు ప్రదేశాలలో ఈ వెదురు మొక్కను తూర్పు వైపున నాటడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి.