Site icon HashtagU Telugu

Varicocele: ఒక వృషణం పెద్దగా మరొకటి చిన్నగా ఉందా?

Varicocele Is One Testicle Large And The Other Small

Varicocele Is One Testicle Large And The Other Small

కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బినట్టుగానే.. కొంతమంది పురుషులలో వృషణాలు లేదా ముష్కాలు (Testis) ఉబ్బుతాయి. ఈ రకమైన పరిస్థితిని వెరికోసిల్‌ (Varicocele) గా పిలుస్తారు. ఈ ప్రాబ్లమ్ వస్తే వృషణాల్లో నొప్పి కలుగుతుంది. ఒక వృషణం మరొకదాని కంటే పెద్దదిగా కనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ వచ్చిన వారికి వీర్యంలో విడుదలయ్యే శుక్రకణాల సంఖ్య తగ్గిపోతుంది.

ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లమ్?

మన శరీరంలో రక్తనాళాల్లో ధమనులు, సిరలు అనేవి ఉంటాయి. వృషణాల పైన టెస్టుక్యులర్‌ వీన్స్‌ అనే సిరలు ఉంటాయి. ఈ సిరల లోపల కవాటాలు సరిగ్గా పనిచేయడం మానేసి.. వృషణాల నుంచి రక్తాన్ని తిరిగి గుండె వైపు మళ్లించడంలో విఫలమైనప్పుడు వెరికోసెల్స్ అభివృద్ధి చెందుతాయి. దీంతో వృషణాల్లో వాపు కలుగుతుంది. ఎక్కువ మంది బాధితుల్లో కుడివైపున ఉండే వృషణమే ప్రభావితం అవుతుంటుంది. సాధారణంగా 15 నుంచి 25 ఏళ్లలోపై వారికే ఈ సమస్య ఎక్కువగా వస్తుంటుంది.

వెరికోసిల్‌ (Varicocele) లక్షణాలు ఇవీ..

  1. వృషణాల్లో నొప్పి
  2. వాపు
  3. నీరసం
  4. కూర్చున్నపుడు నొప్పిగా.. పడుకున్నపుడు మామూలుగా ఉంటుంది.
  5. అధిక బరువు ఉన్న వారిలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది.

సంతానం కలుగుతుందా?

వృషణాల్లో రక్త సరఫరా సరిగా లేకపోవడంతో వీర్యంలోని శుక్రకణాల కదలిక తగ్గిపోతుంది. బీజాలు చిన్నగా కావడంతో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ కూడా తగ్గుతుంది. ఇటువంటి కారణాల వల్ల కొంతమంది బాధిత రోగులకు సంతానం కలగడంలో ఆలస్యం జరుగుతుంది. మరి కొంతమందికి సంతానం ఎప్పటికీ కలగకపోవచ్చు అని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆయుర్వేద నిపుణుల చిట్కాలు

అత్తిపత్తి ఆకులను దంచి రసం తీసి వృషణాలపై రాయాలి. బొప్పాయి ఆకు, పండును కలిపి రుబ్బి.. పాలు లేదా నెయ్యిలో కలిపి వృషణాలకు
మర్దన చేయాలి.

సర్జరీ తప్పనిసరా ? కాదా?

  1. వరికోసెల్ ను దాని సైజ్ ను బట్టి 3 క్లినికల్ గ్రేడ్‌లలోకి వర్గీకరిస్తారు.  మీ వృషణంలో ఉన్న ముద్ద పరిమాణం ప్రకారం.. వాటిని 1 నుంచి 3 వరకు లేబుల్ చేస్తారు. గ్రేడ్ 1 అతి చిన్నది మరియు గ్రేడ్ 3 పెద్దది.
  2. ఇబుప్రోఫెన్ వంటి మందులు కూడా దీనివల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తాయని అంటారు. అయితే వైద్యులు సూచిస్తేనే ఇవి తీసుకోవాలి.
  3. డాక్టర్ల ప్రకారం.. వేరికోసిల్‌కు చికిత్సలలో రకరకాలు ఉన్నాయి. ఇది మందులతో నయంకాదు. అందువల్ల కేవలం ఆపరేషన్‌ చేయాల్సిందే. అందులో లాప్రోస్కొపిక్‌, ఎంబొలైజేషన్‌, మైక్రోస్కోపిక్‌ పద్ధతులు ఉన్నాయి. అన్నింటిలో మైక్రోస్కోపిక్‌ పద్ధతితో ఫలితాలు అత్యుత్తమంగా వస్తాయి.
  4. వృషణానికి రెండువైపులా ఆపరేషన్‌ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. సర్జరీ తర్వాత రోగి ఆసుపత్రిలో 3 రోజులు ఉండి డిశ్చార్జ్‌ కావచ్చు. వారానికోసారి ఫాలో అప్‌ కోసం ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు అంటున్నారు.
  5. ఈ శస్త్ర చికిత్స చేసుకున్న వారు బరువులు ఎత్తకూడదు. పరుగు, వెయిట్‌ లిఫ్టింగ్‌ కు కూడా దూరంగా ఉండాలి.

Also Read:  America Gun Riot: అగ్రరాజ్యం లో మళ్లీ తుపాకీ కలకలం

Exit mobile version