Site icon HashtagU Telugu

Vankaya Menthi Kaaram: వంకాయ మెంతి కారం ఇలా చేస్తే చాలు.. లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Mixcollage 21 Dec 2023 08 32 Pm 4262

Mixcollage 21 Dec 2023 08 32 Pm 4262

సాధారణంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒకే విధమైన వంటలు తిని బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త కొత్త రెసిపీ లను తినాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొత్త కొత్త రెసిపీలను ఎలా ట్రై చేయాలో తెలియక చాలామంది తెగ ఆలోచిస్తూ ఉంటారు. మీరు కూడా ఏదైనా కొత్త రెసిపీ ట్రై చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ రెసిపీ మీ కోసమే.. వంకాయ మెంతికారం కర్రీ ని ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వంకాయ మెంతి కారంకి కావలసిన పదార్థాలు :

వంకాయలు – పావుకేజీ
చింతపండు – తగినంత
మెంతులు – రెండు స్పూను
ఆవాలు – ఒక స్పూను
ఎండు మిరపకాయలు – ఆరు
మినపపప్పు – ఒక స్పూను
పసుపు, ఉప్పు, నూనె – తగినంత

వంకాయ మెంతి కారం తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత చింతపండు నుండి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఒక పాన్‌లో కొంచెం నూనె పోసి కాగాక ఆవాలు, మినపపప్పు, మెంతులు వేయించాలి. చివరగా ఎండు మిరపకాయలను వేసి దించేయాలి. అందులో కొంచం ఉప్పు వేసి అన్నీ పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌లో తగినంత నూనె పోసి కాగాక ఉడికించిన వంకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. ఈ మిశ్రమం వేగాక సిద్ధంగా వున్న పొడిని చల్లి ఇంకా కొంచెంసేపు వేయించి దించేయాలి. అంతే వంకాయ మెంతి కారం రెడీ.