Site icon HashtagU Telugu

Vankaya Menthi Aaram: వంకాయ మేతి కారం ఇలా చేస్తే చాలు.. లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Vankaya Menthi Aaram

Vankaya Menthi Aaram

మామూలుగా మనం వంకాయతో ఎన్నో రకాల రెసిపీలు ట్రై చేస్తూ ఉంటాం. వంకాయ చెట్నీ, వంకాయ మసాలా కర్రీ, వంకాయ వేపుడు, గుత్తి వంకాయ కర్రీ, వంకాయ పుల్లగూర అంటూ రకరకాల రెసిపీలు తింటూ ఉంటాం. ఒకే రకమైన వంటలు కాకుండా వంకాయలతో కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలి అనుకుంటున్నా వారి కోసం ఈ రెసిపీ. మరి వంకాయ మెంతి కారం ఎలా తయారు చేసుకోవాలి? అందుకు ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వంకాయ మెంతి కారంకి కావలసిన పదార్థాలు

వంకాయలు – పావుకేజీ
చింతపండు – తగినంత
మెంతులు – రెండు స్పూను
ఆవాలు – ఒక స్పూను
ఎండు మిరపకాయలు – ఆరు
మినపపప్పు – ఒక స్పూను
పసుపు – తగినంత
ఉప్పు – తగినంత
నూనె – తగినంత

వంకాయ మెంతి కారం తయారీ విధానం:

ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నుండి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ నీటిలో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఒక పాన్‌లో కొంచెం నూనె పోసి కాగాక ఆవాలు, మినపపప్పు, మెంతులు వేయించాలి. చివరగా ఎండు మిరపకాయలను వేసి దించేయాలి. వీటితో కొంచం ఉప్పు వేసి అన్నీ పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక పాన్‌లో తగినంత నూనె పోసి కాగాక ఉడికించిన వంకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. ఈ మిశ్రమం వేగాక సిద్ధంగా వున్న పొడిని చల్లి ఇంకా కొంచెంసేపు వేయించి దించేయాలి. అంతే వంకాయ మెంతి కారం రెడీ.