Vangi Bath: వంకాయలతో వేడి వేడిగా వాంగి బాత్ ఇలా చేస్తే చాలు టేస్ట్ అదిరిపోవాల్సిందే?

  • Written By:
  • Publish Date - March 2, 2024 / 11:30 AM IST

మాములుగా మనం వంకాయతో ఎన్నో రకాల వంటకాలను తయారు చేసుకొని తింటూ ఉంటారు. వంకాయ చట్నీ, గుత్తి వంకాయ, వంకాయ ఫ్రై, మసాలా కర్రీ అంటూ రకరకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటారు. అయితే ఎప్పుడు అయినా వాంగి బాత్ తిన్నారా. తినకపోతే వెంటనే సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోండి.

కావాల్సిన పదార్థాలు :

బియ్యం – ఒకటిన్నర కప్పు
వంకాయలు – పావుకిలో
ఉల్లిపాయలు – మూడు
క్యాప్సికం – ఒకటి
నెయ్యి – రెండు టీ స్పూన్లు
వేరుశెనగ పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు
ఆవాలు – ఒక స్పూను
వాంగీ బాత్ పౌడర్ – ఒక స్పూన్
నీళ్లు – మూడున్నర కప్పులు
శెనగపప్పు – ఒక స్పూను
కొత్తిమీర తురుము – రెండు స్పూన్లు
మినప్పప్పు – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – అర స్పూన్

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగానే అన్నాన్ని వండుకోవాలి. మరీ మెత్తగా కాకుండా పొడిపొడిగా వండుకోవాలి.
ఉల్లిపాయలు, వంకాయలు పొడవుగా ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. అందులో ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అవి వేగాక పల్లీలు కూడా వేసి వేయించాలి. తర్వాత నిలువుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకులు వేసి వేయించాలి. ఆ తరువాత క్యాప్సికంలు, వంకాయ ముక్కలు కూడా వేయించాలి. మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి. తర్వాత ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి కలపాలి. దీనిపై కొత్తిమీర చల్లుకుంటే వాంగీ బాత్ రైస్ రెడీ.