Valentine’s Day: వాలంటైన్స్ డేన మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్ ఇవ్వండి…ఫిదా అయిపోతారు…!

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు...ఈ రోజు దగ్గర్లోనే ఉంది. లేడిస్ అండ్ జెంట్స్ ఇద్దరూ కూడా తమ ప్రియమైనవారి మనస్సుదోచే విధంగా గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటారు.

  • Written By:
  • Publish Date - February 8, 2022 / 12:02 PM IST

ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు…ఈ రోజు దగ్గర్లోనే ఉంది. లేడిస్ అండ్ జెంట్స్ ఇద్దరూ కూడా తమ ప్రియమైనవారి మనస్సుదోచే విధంగా గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రియుడు లేదా ప్రియురాలిని ఆనందపరిచే బహుమతి ఇస్తేనే త్రుప్తి కలుగుతుంది. ఆ విధంగా వినూత్నంగా ఏ బహుమతిని కొనాలన్నదానిపై మీరు గందరగోళానికి గురవుతుంటారు. ఈ బహుమతి కొనాలా వద్దా అనే సందగ్ధంలో ఉండిపోతారు. అయితే మీరు చింతించాల్సిన అవసరం లేదు. సరైన బహుమతిని కొనుగోలు చేయడంలో మీకు సహాయపడేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అంతేకాదు ఇవి వినూత్నంగా మీకు ఉపయోగపడతాయి.

వైట్ డెజర్ట్ డ్రెస్: ప్రస్తుతం ఉన్న దుస్తుల్లో ఇది చాలా బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. ప్రత్యేకమైన రోజు మనం ఈ దుస్తువులను ధరించవచ్చా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు ఎలాంటి అనుమానం లేకుండా వెంటనే గుర్తుకు వచ్చేది ఈ వైట్ డెజర్ల్.. ప్రతి ఒక్కరి వార్డ్ రోబ్ లో ఉండాల్సిందే. మీ భాగస్వామికి ఇలాంటి వైట్ డెజర్ట్ లేనట్లయితే మీరు దాన్ని కొనుగోలు చేయండి.

స్పీకర్: ప్రేమలో మునిగితేలేవారందరూ సంగీతానికి బానిస కాలేరు. సో మీరు వాటర్ ఫ్రూఫ్ స్పీకర్ ను గిఫ్ట్ గా ఇస్తే…అంతకంటే మంచి బహుమతి మరొకటి ఉండదు. నిశ్శబ్ద వాతావరణంలో ఆ స్పీకర్ తో పాటలు వింటుంటే ప్రతిక్షణం మీ జ్ణాపకాలే మనసు నింపుతూనే ఉంటాయి. ఈజీగా క్యారీ చేసే పోర్టబుల్ స్పీర్లు కొనడం మరింత ఆనందానిస్తుంది.

స్మార్ట్ వాచ్: మీ భాగస్వామి ఫిట్ బాడీని మెయింటెయిన్ చేస్తే…అతనికి స్మార్ట్ వాచ్ సరైన బహుమతి. మీరు కచ్చితంగా స్మార్ట్ వాచ్ ను గిప్ట్ గా ఇవ్వండి. స్మార్ట్ వాచ్ కాకుండా ప్రోటీన్ షేక్ బాటిల్స్, ఫిట్ నెట్ ఫ్యాంట్ లను కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.

బుక్స్ : మీ భాగస్వామికి పుస్తకాలు చదివే ఆసక్తి ఉన్నట్లయితే ఎలాంటి ఆలోచన లేకుండా పుస్తకాన్ని గిఫ్ట్ గా ఇవ్వండి. ఈ పుస్తకం బహుమతిగా ఇవ్వడం ద్వారా మీ ప్రేమను వ్యక్త పరచవచ్చు. గదిలో వేల పుస్తకాలు ఉన్న మీరిచ్చిన పుస్తకం మీ భాగస్వామికి త్రుప్తినిస్తుంది.

ఎయిర్ ఫ్యూరిఫయర్ ఫ్లాంట్స్ : పెద్ద మొత్తంలో చెట్లను పెంచలేని నేటి రోజుల్లో ప్రతిఒక్కరూ ఆకసక్తి కనబరుస్తూ చిన్న మొక్కలను పెంచుతున్నారు. అందుకే మీ భాగస్వామికి ఎయిర్ ఫ్యూరిఫయర్ ఇండోర్ ఫ్లాంట్స్ ను బహుమతిగా ఇవ్వండి. వాటిని చూసినప్పుడల్లా మీరే గుర్తుకువస్తారు.