మామూలుగా అమ్మాయిలు అబ్బాయిలు అందంగా కనిపించడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అందుకే కొంతమంది న్యాచురల్ రెమిడీలను కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఎప్పుడైనా తులసి ఆకుల రెమెడీ ఫాలో అయ్యారా, ఎప్పుడు ట్రై చేయకపోతే ఇప్పుడు చెప్పినట్టుగా ట్రై చేస్తే ముఖం అందంగా మెరిసిపోవడం ఖాయం అంటున్నారు. మరి తులసి ఆకులతో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి ఆకులు అనేక చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయట.
దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయట. ఇవి చర్మ సమస్యలకు వ్యతిరేకంగా పని చేస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా మొటిమల సమస్య, పొడి చర్మం లాంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయట. ఇంతకీ తులసి ఆకులను ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. మొక్క నుండి కొన్ని తాజా తులసి ఆకులను కోసుకొని, ఒక కప్పు నీటిని మరిగించి, దానికి తులసి ఆకులను వేయాలి. ఈ నీరు చల్లారిన తరువాత ఆకులను వడకట్టాలట. స్ప్రే బాటిల్ లో ద్రవాన్ని నింపి, మేకప్ తొలగించే ముందు, తర్వాత మీ ముఖం, మెడపై అప్లై చెయ్యాలి అని చెబుతున్నారు. అలాగే తులసిని నిమ్మకాయతో కలిపి ఫేస్ ప్యాక్ గా ఉపయోగించవచ్చట.
తులసి నిమ్మకాయ ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ తులసి పొడి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ తాజా నిమ్మరసం కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. తర్వాత ముఖం, మెడ భాగం అంతా అప్లై చేసి, 10 నిమిషాలు అలానే వదిలేయాలని చెబుతున్నారు. తర్వాత ముఖాన్ని కడిగి, మాయిశ్చరైజర్ రాస్తే చాలని చెబుతున్నారు. అలాగే తులసి పెరుగు ఫేస్ ప్యాక్ కూడా అందాన్ని పెంచుతుందట. ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ తులసి పొడి తీసుకోవాలి. దానికి ఒక టేబుల్ స్పూన్ పెరుగు జోడించాలి. ఈ రెండింటినీ కలిపి మంచి పేస్టులాగా చేయాలి. ఇప్పుడు దీనిని మీ ముఖం, మెడపై రాసి 15 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. అందంగా మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు అని చెబుతున్నారు..