Site icon HashtagU Telugu

Beauty Tips: ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే టమోటాలతో ఈ విధంగా చేయాల్సిందే!

Beauty Tips

Beauty Tips

మామూలుగా ప్రతి ఒక్కరి వంట గదిలో టమోటా తప్పనిసరిగా ఉంటుంది. టమోటాను ఉపయోగించి చాలా రకాలు వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. టమోటా లేకుండా కొన్ని రకాల వంటలు కూడా పూర్తి కావు. అయితే టమోటాలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఉపయోగపడతాయి అన్న విషయం చాలామందికి తెలియదు. మన చర్మ సౌందర్యాన్ని టమోటాలు రెట్టింపు చేస్తాయి. వీటిని తరచుగా వినియోగించడం వల్ల ముఖం కూడా కాంతివంతంగా మెరిసిపోతుందట. మరి టమోటాలతో ముఖాన్ని ఎలా మెరిపించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మీ చర్మం జిడ్డుగా అనిపించినప్పుడు ముఖంపై టమోటా ను 10 నిమిషాల పాటు బాగా రుద్ది ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయడం వల్ల ముఖంపై జిడ్డు తొలగిపోతుందట. టమాటా సహజంగా రక్తస్రావ నివారణగా పనిచేస్తుందని చెబుతున్నారు.. కాబట్టి ఓపెన్ రంధ్రాలు బ్లాక్ హెడ్స్ ని తగ్గించడానికి దీనిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. టమాటాలు ఆస్ట్రింజెంట్ గా పనిచేయడంతో పాటు చర్మం యొక్క నిస్తేజాన్ని కూడా మేలుకొలపటానికి సహాయపడుతుందట.

అలాగే టమాటాలోని ప్రకాశవంతం చేసే గుణాలు మీకు సన్ టాన్ ని తొలగించి టోన్ ప్రకాశంవంతమైన ఛాయను అందించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అయితే ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల టమాటా గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల చర్మంపై ఉండే టాన్ తొలగిపోతుందట. టమోటా వల్ల చర్మానికి ఫ్రెష్, ఫెయిర్ లుక్ వస్తుందట. ముఖం జిడ్డుగా అనిపిస్తుంది అనుకున్న వారు ముఖంపై ముడతలు మచ్చలు వంటివి ఎక్కువగా వస్తున్నాయి అనుకున్న వారు టమోటా ని సగానికి కట్ చేసి చక్కెర అప్లై చేసి ముఖానికి స్క్రబ్ చేయడం వల్ల ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చట.