Site icon HashtagU Telugu

Black Neck: నల్లటి మెడ కారణంగా ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ చిట్కాలతో నలుపు మాయం అవ్వాల్సిందే!

Black Neck

Black Neck

మాములుగా స్త్రీ పురుషులకు మెడపై నలుపు ఉండడం అన్నది సహజం. పురుషులు ఈ విషయం గురించి అంతగా పట్టించుకోకపోయినా స్త్రీలు మాత్రం మెడపై నలుపును పోగొట్టుకోవడం కోసం ఎన్నెన్నో క్రీమ్ లు, ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకునే వాడుతూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు మంచి ఫలితాలు కనిపించవు. అయితే అలాంటప్పుడు ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించడం వల్ల మెడ పైన నలుపును తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెడపై మరీ నల్లగా ఉంటే అటువంటి వారు శనగపిండి వాడితో నలుపును వదిలించవచ్చట.

మెడ నల్లగా మారడానికి సరిగా శుభ్రం చేయకపోవడమే కారణం కావచ్చని చెబుతున్నారు. దీని కారణంగా మెడపై నలుపు క్రమంగా పేరుకుపోవడం ప్రారంభమౌతుందట. దీనిని శెనగ పిండితో ఈజీగా వదిలించవచ్చట. అలాగే శనగపిండిలో అనేక గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేసే ప్రోటీన్‌ ను కలిగి ఉంటుందట. శనగపిండి ముఖంపై మెరుపును తెస్తుందట. మెడపై నలుపును శుభ్రం చేయడానికి కూడా దీనిని ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం ఒక గిన్నెలో శనగ పిండిని తీసుకొని, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. మసాజ్ చేసేటప్పుడు ఈ పేస్ట్‌ ను మెడపై రాయాలి.10 నిమిషాల తర్వాత మెడను నీటితో శుభ్రం చేసుకోవాలి.

అయితే ఈ రెమెడీని వారానికి 2 రోజులు ఉపయోగిస్తే సరిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా పెరుగుతో కూడా మెడపై నలుపును శుభ్రం చేయవచ్చట. ఈ లక్షణాలన్నీ ఆరోగ్యానికి అలాగే చర్మానికి మేలు చేస్తాయి. పెరుగు సహాయంతో మెడలోని నలుపును కూడా తొలగించవచ్చని చెబుతున్నారు. ఒక గిన్నెలో పెరుగు తీసుకొని దానికి చిటికెడు పసుపు వేయాలట. ఈ పేస్ట్‌ను మెడపై రాసి తరువాత, మెడను శుభ్రం చేయాలట. ఈ రెమెడీని వారానికి రెండు సార్లు చేయాలనీ చెబుతున్నారు. తేనె అనేక లక్షణాలతో నిండి ఉంది, ఇది ఔషధ గుణాలను కలిగి ఉంటుందట. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, చర్మానికి మేలు చేసే అనేక ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి. మెడలోని నలుపును కూడా తేనె సహాయంతో తొలగించవచ్చట. అయితే అందుకోసం తేనె తీసుకొని కొద్దిగా నిమ్మరసం కలపాలి. మసాజ్ చేసేటప్పుడు ఈ పేస్ట్‌ను మెడపై రాయాలి. 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి.ఈ రెమెడీని వారానికి 2 రోజులు చేయాలి.