మన వంటింట్లో దొరికే కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. బంగాళదుంప వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తరచుగా తినమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే బంగాళదుంప కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ముఖ్యంగా కొన్ని రకాల ఆలూ ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బంగాళాదుంప లో ఉండే విటమిన్ సి, బి సిక్స్, తోపాటు పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి మీ చర్మానికి ప్రయోజనకరమైన యాంటీ ఆక్సిడెంట్లను ఇస్తాయట. వీటి వలన మెరిసే చర్మాన్ని పొందవచ్చట. అయితే ఇందుకోసం మూడు టేబుల్ స్పూన్ల బంగాళదుంప రసం, రెండు టేబుల్ స్పూన్ల తేనె సరిపోతుందట. బంగాళదుంప రసాన్ని తేనెతో కలిపి ముఖానికి, మెడకి అప్లై చేయాలి. తర్వాత పది పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచి ఆపై ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయటం వలన ముఖం పై ముడతలు త్వరగా రాకుండా నివారించవచ్చని చెబుతున్నారు. మరొక రెమిడి విషయానికొస్తే..
రెండు టేబుల్ స్పూన్ల బంగాళదుంపల రసం, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, హాఫ్ టీ స్పూన్ తేనె బాగా కలిపి ముఖానికి మరియు మెడ అంతటా అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత నీటితో బాగా క్లీన్ చేయాలి. ఇలా రోజు తప్పించి రోజు చేయటం వలన మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయని చెబుతున్నారు. అలాగే చర్మం టోనింగ్ లో కూడా బాగా సహాయపడతాయి. మొటిమల సమస్యతో ఇబ్బంది పడేవారు ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప రసం, ఒక టేబుల్ స్పూన్ టమోటా రసం, ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి మెడకి అప్లై చేయాలి. తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. మొటిమలు తగ్గే వరకు వరకు ప్రతిరోజు ఇలా చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వలన చర్మం ఎర్రబడటం, అలాగే బ్యాక్టీరియాను మీ చర్మం నుంచి దూరం చేయటంలో ఈ మాస్క్ ఎంత బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.