స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరు కూడా అందమైన జుట్టు కావాలని కోరుతూ ఉంటారు. పురుషులు బట్టతల లేకుండా జుట్టు బాగా ఉండాలని కోరుకుంటే స్త్రీలు అందంగా ఒత్తుగా లావైన జడ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఇక అందమైన జుట్టు కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటితో పాటు కొన్ని హోమ్ రెమిడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉంటుంది. కానీ మనం ఒక రకమైన మల్లె పువ్వును వాడే విధంగా వాడితే జుట్టు సమస్యలన్నీ తగ్గిపోతాయట. జుట్టు రాలడం తగ్గడమే కాకుండా ఒత్తుగా పెరుగుతుందట.
తెల్ల జుట్టు సమస్య కూడా తగ్గుతుందట. మల్లె పువ్వు మన అందరికీ తెలుసు. కానీ దీనిని మొగ్రా మల్లె పువ్వు అని అంటారట. దీని వాసన చాలా బాగుంటుందట. అన్ని మల్లె పువ్వుల కన్నా ఎక్కువ సువాసన వస్తుందట. ఈ మల్లె పువ్వులో చాలా సహజమైన లక్షణాలు ఉన్నాయట. ఇవి జుట్టుకు చాలా బాగా ఉపయోగపడతాయని, ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ మొగ్రా మల్లెపువ్వు నుంచి తీసిన నూనె రాయడం వల్ల జుట్టు ఊడటం అనేది ఉండదని చెబుతున్నారు. మీకు మార్కెట్‌లో మొగ్రా పూల నూనె దొరుకుతుంది.
జుట్టు సంరక్షణకు ఇది అద్భుతమైన నూనె. దీన్ని తయారు చేయడానికి, మీకు తాజా మొగ్రా పువ్వులు అవసరం, వాటిని కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెలో నానబెట్టి, 2 నుంచి 3 రోజులు ఎండలో ఉంచాలి. తద్వారా పువ్వుల లక్షణాలన్నీ నూనెలోకి వస్తాయి. ఈ నూనెను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా, ఒత్తుగా , మెరుస్తూ ఉంటుందట. రాత్రి పడుకునే ముందు ఈ నూనెతో తలకు మసాజ్ చేయాలట. రాత్రంతా ఈ నూనెను జుట్టు మీద ఉంచి మరుసటి రోజు షాంపూ చేస్తే సరిపోతుందట. ఈ నూనె వాడితే తెల్ల జుట్టు సమస్య అనేది ఉండదట. మొగ్రా మల్లెపూల నూనె మాత్రమే కాదు, షాంపూ కూడా మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే ఇంట్లోనే ఈ పూల రసం తీసి షాంపూ తయారు చేసుకోవచ్చట. ఈ పూల షాంపూ వాడటం వల్ల జుట్టులో జిడ్డు, మురికి వదలడంతో పాటూ జుట్టుకు మంచి పోషణ కూడా లభిస్తుందట.