మార్కెట్ లో మనకు ఏడాది పొడవునా లభించే పండ్లలో అరటిపండు మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. అరటి పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఒక అరటి పండుని తినమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అరటి పండ్లు మంచిదే కదా అని మోతాదుకు మించి తింటే మాత్రం సమస్యలు వస్తాయి. మామూలుగా మనం అరటి పండ్లు తిన్న తర్వాత అరటి తొక్కను బయటకు విసిరేస్తూ ఉంటాం. కానీ అరటి తొక్క వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి అరటి తొక్క వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరటి పండు తొక్కలో ఉండే ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి తొక్క లోపలి భాగంతో ముఖాన్ని రుద్ది ఒక అరగంట సేపు ఆగి చల్లటి నీళ్లతో కడుగాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మీ ముఖం పై ఉన్న ముడతలను ఈజీగా తగ్గించుకోవచ్చు. మనలో కొంతమందికి ఎదిగే క్రమంలో పళ్లు కొద్దిగా లేత పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఎంత తోమినా తెల్లగా కాకపోగా పళ్లను పెదవుల కిందే దాచుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అరటి తొక్క లోపలి భాగంతో పళ్ళని రుద్దడం వల్ల మీ పళ్ళు నిగ నిగలాడుతూ తెల్లగా మెరిసిపోతాయి. అలాగే ఏదైనా దోమ వంటి పురుగుల కాటుకు గురై చర్మంపై దురదలు, మంటలు కనుక వస్తే వాటిని తగ్గించడానికి అరటి పండు తొక్క ఉపయోగపడుతుంది.
చర్మంపై ఎక్కడైతే సమస్యగా ఉందో అక్కడ అరటి పండు తొక్కను రాసి 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దురద, మంట తగ్గిపోతుంది. మన దినచర్య లో భాగంగా బయట ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తుంది. ఎండలో తిరగడం వల్ల చర్మం అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది. అలాంటప్పుడు అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అరగంట సేపు ఆగాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. అలాగే కాలిన గాయాలు, దెబ్బలకు అరటి పండు తొక్క ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. సమస్య ఉన్న శరీర భాగంపై అరటి పండు తొక్కను ఉంచి కట్టు కట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒకటి, రెండు రోజుల్లోనే దెబ్బలు మానిపోతాయి. మన శరీరం లో ఏదైనా భాగంలో చిన్న పాటి నొప్పిగా ఉంటే అక్కడ అరటి పండు తొక్కను కొద్ది సేపు మసాజ్ చేసినట్టు రాయాలి. ఇలా చేస్తే 15 నిమిషాల్లోనే నొప్పి మాయం అవుతుంది.