Fiber Rice: ఫైబర్ రైస్ తో ఆ వ్యాధికి చెక్ పెట్టవచ్చా?

ప్రస్తుత కాలంలో ప్రతి పది మందిలో ఐదు మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీనినే షుగర్ వ్యాధి లేదా

  • Written By:
  • Publish Date - December 1, 2022 / 07:00 AM IST

ప్రస్తుత కాలంలో ప్రతి పది మందిలో ఐదు మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. దీనినే షుగర్ వ్యాధి లేదా మధుమేహం అనికూడా పిలుస్తూ ఉంటారు. ఈ డయాబెటిస్ అనే వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే చాలు చనిపోయేంతవరకు మనల్ని విడిచి వెళ్లదు. మధుమేహం ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలను తినాలన్న కూడా సంకోచిస్తూ ఉంటారు. అందుకు గల కారణం తినే ఆహార పదార్థాల వల్ల రక్తం లోని చక్కెర స్థాయిలు పెరుగుతాయి అని భయపడుతూ ఉంటారు. అయితే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడానికి మార్కెట్లోకి ఎన్నో రకాల మెడిసన్స్ వచ్చినప్పటికి పూర్తిగా మధుమేహాన్ని అదుపులో ఉంచే మెడిసెన్ ని ఇంకా కనుగొనలేదు.

అయితే మెడిసెన్స్ ఉపయోగించి, అలాగే కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలు, వంటింటి చిట్కాల ద్వారా డయాబెటీస్ ను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే వైట్ రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం వుంది. కానీ ఫైబర్ రైస్ తినడం వల్ల షుగర్ వ్యాదికి చెక్ పెట్టవచ్చు. పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకోవడం వల్ల డయాబెటిస్, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చు. అయితే పాలిష్ చేసిన బియ్యం వాడకం వలన టైప్-2మధుమేహం వస్తుంది. అదేవిదంగా కళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

కాబట్టి ఫైబర్ ఎక్కువగా లభించే పదార్థాలు ఆహారంగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. వైట్ రైస్ స్థానంలో హై ఫైబర్ రైస్ ను తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుంది. అంతేకాకుండా అధిక బరువు సమస్యకు కూడా చెక్ పెట్టవచ్చు. అధిక బరువు సమస్యలతో బాధపడేవారు వైట్ రైస్ కి బయలుగా ఫైబర్ రైస్ ని తీసుకోవడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు కనిపిస్తాయి.