Site icon HashtagU Telugu

Dark Circles: డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ ఒక్క పని చేస్తే చాలు!

Dark Circles

Dark Circles

డార్క్ సర్కిల్స్ సమస్య మామూలుగా ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు గంటల తరబడి చూసే వారికి ఈ సమస్య ఎక్కువగా వస్తూ ఉంటుంది. ముఖం అంతా అందంగా ఉన్నప్పటికీ కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడి ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని డార్క్ సర్కిల్స్ అని అంటారు. అయితే వీటిని తగ్గించడం కోసం మార్కెట్లో దొరికే ఎన్నో రకాల బ్యూటీ ప్రొడక్టులను ఉపయోగించడంతోపాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరుగుతూ వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లోనే దొరికే వాటితో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉదయాన్నే కాఫీ తాగితే రీఫ్రెష్ గా అనిపిస్తుందట. కాఫీ మనల్ని నిద్రలేపడానికి మాత్రమే కాదు నిద్రలేమి వల్ల వచ్చిన సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుందట. ఇవి మన చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడానికి బాగా సహాయపడతాయట. అలాగే చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేయడానికి ఎంతగానో సహాయపడతాయని, దీంట్లో ఉండే విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీరాడికల్స్, కెఫిన్ వంటివి ముఖంపై ఉన్న ముడతలను, డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడానికి ఎంతో బాగా సహాయపడతాయని చెబుతున్నారు. ఇంతకీ డార్క్ సర్కిల్స్ కోసం కాఫీని ఎలా ఉపయోగించాలి అన్న విషయానికి వస్తే.. కళ్ల చుట్టూ ఉన్నా నల్లటి వలయాలను పోగొట్టడానికి కాఫీ పౌడర్ లేదా కాఫీ జెల్ ను ఉపయోగించవచ్చట. దీనికోసం కాఫీ జెల్ ను తీసుకుని వేలితో కళ్ల కింద అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలట.

రోజూ ఇలా చేయడం వల్ల ఈ నల్లటి వలయాలు క్రమ క్రమంగా తగ్గుతాయని చెబుతున్నారు. కాఫీ జెల్ తో పాటుగా కాఫీ పౌడర్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ ను ఉపయోగించి కూడా డార్క్ సర్కిల్స్ ను పూర్తిగా పోగొట్టవచ్చట. అయితే ఇందుకోసం ఒక గిన్నెలో కాఫీ పౌడర్ ను వేసి దాంట్లో తేనె వేసి పేస్ట్ లా చేసి ఇందులో చిటికెడు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి బాగా కలిపీ ఆ తర్వాత డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలట. 10 నిమిషాల తర్వాత కూల్ వాటర్ తో కళ్లను శుభ్రం చేసుకోవాలని, ఇలా తరచుగా చేస్తే డార్క్ సర్కిల్స్ క్రమంగా మాయమవుతాయని చెబుతున్నారు. బీమ్ కాఫీ పొడి, బాదం పప్పులతో కూడా డార్క్ సర్కిల్స్ ను దూరం చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఉండే పోషకాలు డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయట. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడిని వేసి అందులో బాదం ఆయిల్ పోసి బాగా కలపి ఈ పేస్ట్ ను డార్క్ సర్కిల్స్ కు పెట్టాలఫ్ట. తర్వాత వేళ్లతో మసాజ్ చేయాలట. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. దీనివల్ల మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుందట.