Site icon HashtagU Telugu

Upma Bonda: మిగిలిపోయిన ఉప్మా తో టేస్టీగా బోండాలు తయారు చేసుకోండిలా?

Mixcollage 15 Mar 2024 07 29 Pm 418

Mixcollage 15 Mar 2024 07 29 Pm 418

మామూలుగా మనలో చాలామంది ఉప్మాను తినడానికి అంతగా ఇష్టపడరు. దీంతో ఇంట్లో ఉప్మా చేసిన ప్రతిసారి కూడా ఎక్కువ మొత్తంలో మిగిలిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ ఉప్మాను ఏం చేయాలో తెలియక చాలామంది పారేస్తూ ఉంటారు. అయితే ఇక మీదట అలా చేయకండి. మిగిలిపోయిన ఉప్మాతో టేస్టీగా బోండాలు తయారు చేసుకోవచ్చు. మరి అందుకోసం ఏం చేయాలి ఆ రెసిపీని ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే..

కావాల్సిన పదార్థాలు :

వండిన ఉప్మా – రెండు కప్పులు
బియ్యప్పిండి – రెండు స్పూన్లు
కారం – అర టీస్పూను
వాము – అర టీస్పూను
బేకింగ్ సొడా – పావు టీస్పూను
శెనగపిండి – ఒక కప్పు
నీళ్లు – తగినన్ని
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – వేయిండానికి సరిపడా
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు

తయారీ విధానం :

ముందుగా ఉప్మాను సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఉప్మా మీకు నచ్చిన విధంగా వండుకోవాలి. చల్లారాక వాటిని ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శెనగపిండి, బేకింగ్ సోడా, బియ్యప్పిండి, వాము, కారం, ఉప్పు వేసుకుని బాగా కలపాలి.
కొంచెం నీళ్లు కలుపుకుని ఉండలు కట్టకుండా కలపాలి. బోండాలు వేసుకోవడానికి వీలుగా చిక్కగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలపాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక రుబ్బులో ముంచుకున్న ఉప్మా ఉండల్ని తీసి నూనెలో వేసి వేయించాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే మంచి రుచిగా ఉంటాయి.