ఇది వరకటి రోజుల్లో 45 ఏళ్లు లేదా 50 ఏళ్ళు పైబడిన వారికి మాత్రమే తెల్ల వెంట్రుకలు వచ్చేవి. కానీ రాను రాను కాలక్రమేనా వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారికి కూడా ఈ తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుత రోజుల్లో 12 ఏళ్ల పైబడిన పిల్లలనుంచి ఈ తెల్ల వెంట్రుకల సమస్యలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా యువత ఈ తెల్ల వెంట్రుకల కారణంగా వయసు మీద పడిన వారిలా కనిపించడంతో నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెండ్స్ ఎగతాళి చేస్తారని ఇబ్బంది పడుతూ ఉంటారు. తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి రకరకాల హెయిర్ కలర్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే మామూలుగా తెల్ల జుట్టు సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మరి తెల్ల జుట్టు సమస్యతో మీరు కూడా విసిగిపోతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఒక చిట్కా పాటిస్తే చాలు జుట్టు నల్లగా అవ్వడం కాయం. అందుకోసం కావాల్సింది ఉమ్మెత్త ఆకులు. ఉమ్మెత్త ఆకులను తీసుకొని మెత్తగా దంచి స్వచ్ఛమైన నువ్వల నూనెలో మరిగించాలి. ఆ తర్వాత దాన్న చల్లార్చి వడకట్టాలి. దీన్ని వారం రెండు రోజుల పాటు తలకు అప్లై చేయడం వల్ల ఈ నూనె చుండ్రు, జుట్టు రాలడం వంటి జుట్టు సమస్యలను అరికట్టడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అలాగే డాతురా పునరుత్పత్తి లక్షణాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయ పడతాయి. ఉమ్మెత్త ఆయిల్ తో పాటు మీ స్కాల్ప్ కు మసాజ్ చేయడం వల్ల స్కాల్ప్ లో రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే జుట్టు పెరుగుదలను పెంచుతుంది.
తెల్ల జుట్టు సమస్యలను నివారించి జుట్టు కండిషన్ లో ఉండేలా చేస్తుంది. నువ్వుల నూనెను జుట్టు పెరుగుదలకు స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి ప్రముఖంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనె తలలోని చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది రసాయనిక నష్టాన్ని, నయం చేయడంలో సహాయపడుతుంది. మీ జుట్టు షాప్ట్ లు మరియు ఫోలికల్స్ కు పోషణను అందిస్తుంది. బట్టతల, తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ చిట్కాలు పాటించి మీ సమస్య నుండి బయట పడవచ్చు. అందుకే వారంలో రెండు రోజులు ఈ నూనెను తలకు పట్టించుకొని తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు..