Site icon HashtagU Telugu

Uggani Bajji: నోరూరించే ఉగ్గాని బజ్జీ.. ఇంట్లో ఈజీగా చేసుకోండిలా?

Mixcollage 31 Dec 2023 02 35 Pm 6728

Mixcollage 31 Dec 2023 02 35 Pm 6728

మామూలుగా ప్రతిరోజు ఇడ్లీ,ఉప్మా, పూరి, దోశ్ వంటి టిపిన్స్ తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకే విధమైన టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా కూడా తినాలని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో స్త్రీలు కూడా పిల్లలనుంచి పెద్దవారి వరకు అందరికీ ఇష్టమైన వంటలు చేయాలని అనుకుంటూ ఉంటారు. అందులోనూ తొందరగా అయిపోయే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో గని బజ్జీ రెసిపీ కూడా ఒకటి. మరి ఈ సింపుల్ రెసిపీని చాలామంది తినే ఉంటారు. కానీ ఈ రెసిపీని ఇంట్లో ఇంకాస్త సులువుగా ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఉగ్గాని బజ్జీకి కావలసిన పదార్థాలు :

టమాటాలు – 2
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 3
మొరుగులు – 100 గ్రాములు
నూనె – సరిపడినంత

ఉగ్గాని బజ్జీ తయారీ విధానం :

ముందుగా పుట్నాల పౌడర్ ఈ విధంగా తయారు చేసుకోవాలి. అందుకోసం వేయించిన శనగపప్పు ఒక్క కొబ్బరి ముక్క , ఒక్క వెల్లుల్లిపాయ,కారం ఉప్పు వేసి బాగా మిక్స్ వేసుకోవాలి. తర్వాత 100 గ్రాములు మొరుగులు రెండు కప్పుల వాటర్ నీటిలో వేసి , వాటిని నీరు లేకుండా చేతితో గట్టిగా పిండి పక్కకు తీసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసిన పుట్నాల పప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు జీలకర్ర కరివేపాకు పల్లీలు కళాయిలో వేసి వేయించాలి. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి దోరగా వేగించాలి. బాగా వేగినాక కట్ చేసి పెట్టుకున్న టమాట ముక్కలు వేసి వేగించాలి ఐదు నిమిషాలు మూత పెట్టి వుంచితే బాగా మగ్గుతాయి. మూత తీసి ముందుగా కలిపి పెట్టుకున్న బొరుగులను అందులో వేసి ఐదు నిమిషాలు వేగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కళాయిలో ఉగ్గానిని ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి మిరపకాయ బజ్జీలను ప్లేట్లో పెట్టి తింటే చాలా రుచిగా ఉంటుంది.