Turmeric Face Pack: ముఖానికి పసుపు రాసిన తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకండి?

మామూలుగా స్త్రీలు ముఖం తలతల మెరవడం కోసం ఎక్కువగా పసుపుని ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు ఉపయోగించడం వల్ల ముఖం గ్లో రావడంతో పాటు, మరింత అందంగా తయా

Published By: HashtagU Telugu Desk
Turmeric Face Pack

Turmeric Face Pack

మామూలుగా స్త్రీలు ముఖం తలతల మెరవడం కోసం ఎక్కువగా పసుపుని ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు ఉపయోగించడం వల్ల ముఖం గ్లో రావడంతో పాటు, మరింత అందంగా తయారవుతుందని నమ్ముతూ ఉంటారు. అందుకే పసుపును ఎన్నో రకాల బ్యూటీ ప్రోడక్ట్లలో ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఎవరికైనా ఎటువంటి గాయమైనా అయితే ప్రథమ చికిత్స చేసే కన్నా ముందు పసుపును గాయమయిన చోట రాస్తారు. ఇలా చేయడం వల్ల రక్తస్రావం త్వరగా ఆగిపోతుందని చాలా మంది నమ్ముతారు. పసుపు చాలా మంది మసాలా అనే విషయం మనందరికీ తెలుసు. ఇది రాసుకోవడం వలన చర్మ సౌందర్యం కూడా మెరుగవుతుంది. అలా అని చాలా మంది పసుపుతో పాటు ఏవేవో పదార్థాలను కలిపి చర్మానికి రాస్తుంటారు.

ఇలా చేయడం చాలా ప్రమాదకరం. పసుపుతో పాటు రోజ్ వాటర్, మిల్క్, వాటర్ లలో ఏవైనా కలపాలి తప్ప మరే ఇతర వస్తువులను కలపకూడదు. అనవసర పదార్థాలను కలపడం మూలాన అవి పసుపుతో చర్య పొంది మన శరీరానికి హాని తలపెట్టే కారకాలుగా మారుతాయి. అలాగే పసుపు ఉన్న ముఖానికి పట్టించినప్పుడు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. పసుపును శరీరానికి అప్లై చేయడం చాలా సులువైన పని. కానీ అలా ముఖానికి అప్లై చేసిన తర్వాత ఎంతసేపు ఉంచాలనే విషయం చాలా మందికి సరిగ్గా తెలియదు. ఏ ఫేస్ ప్యాక్లనైనా సరే ముఖానికి అప్లై చేసినపుడు కేవలం 20 నిమిషాల సేపు ఉంచితే సరిపోతుంది. అన్ని ఫేస్ ప్యాక్ ల మాదిరిగానే పసుపును అప్లై చేసినపపుడు కూడా కేవలం 20 నిమిషాల సేపు ఉంచితే చాలు.

ఎక్కువ సేపు పసుపును ముఖం మీద ఉంచడం వలన ముఖంపై పసుపు చారలు ఏర్పడి ముఖం అందవిహీనంగా తయారవుతుంది. కావున పసుపును అప్లై చేసినపుడు ఎంత సేపు ఉంచుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఎక్కువ మోతాదులో పసుపును స్కిన్ పై అప్లై చేయడం వలన మొటిమలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. పసుపుతో ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత కడుక్కునేందుకు సబ్బును ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. పసుపు రాసిన తర్వాత ముఖానికి 24 నుంచి 48 గంటల వరకు సబ్బును రాయకూడదు. పసుపును అప్లై చేయడంలో చాలా మంది పొరపాటు చేస్తుంటారు. పసుపు ఫేస్ ప్యాక్ ను వాడే ముందు చాలా మంది ఫేస్ మొత్తానికి సమానంగా రాయరు. ఇలా అసంపూర్తిగా మనం పసుపును అప్లై చేయడం వలన మన ఫేస్ పూర్తి గ్లోను పొందదు. అలాగే పసుపు బాగా రాసిన చోట పసుపు పచ్చగా రాయని చోట నార్మల్గా ఉంటూ అందవికారంగా కనిపిస్తూ ఉంటుంది.

  Last Updated: 01 Aug 2023, 09:26 PM IST