Site icon HashtagU Telugu

Turmeric : అజీర్ణానికి పసుపుతో కళ్లెం వేయొచ్చా..!

Turmeric Can Cure Indigestion..!

Turmeric Can Cure Indigestion..!

Turmeric : చాల మంది కి అజీర్ణ లక్షణాలు తగ్గటానికి పసుపులోని కర్‌క్యుమిన్‌ ఎంతో మేలు చేయగలదని తాజా అధ్యయనంలో తెలిసింది .కడుపులో గ్యాస్ తగ్గటానికి వాడే ఒమిప్రజోల్‌ మెడిసిన్ తో సమానంగా ఇది పని చేస్తుండటం విశేషం. పసుపు (Turmeric)లోని కర్‌క్యుమిన్‌కు వాపును తగ్గించే గుణాలు, సూక్ష్మక్రిములను కట్టడి చేసే సామర్థ్యం ఉన్నట్టు మనకు తెలుసు. అందుకే గాయాలు తగ్గటానికి పసువును వాడుతుంటారు. కొన్నిచోట్ల జీర్ణక్రియను పెంచటానికీ కుడా వాడుతుంటారు. అయితే సంప్రదాయ మందులతో పోలిస్తే ఇదెంత సమర్థంగా పనిచేస్తుందనేది చాలా మందికి తెలియదు.

అందువలన దీన్ని గుర్తించటానికే థాయిలాండ్‌ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. అజీర్ణంతో బాధపడుతున్నవారిలో కొందరికి కర్‌క్యుమిన్‌, మరికొందరికి ఒమిప్రజోల్‌ మాత్రలు.. ఇంకొందరికి రెండూ కలిపి ఇచ్చి పరిశీలించారు. అందరిలోనూ నొప్పి, కడుపుబ్బరం వంటి లక్షణాలు దాదాపు సమానంగా తగ్గటం గమనించారు అందుకే పసుపు (Turmeric ) చేసే మేలు చాలా గొప్పది.

Also Read:  Ration Card KYC : రేషన్ కార్డుల ఈ-కేవైసీపై అయోమయం.. లాస్ట్ డేట్ పై నో క్లారిటీ