Vasthu Tips: తులసి మొక్కలలో అలాంటి మార్పులు కనిపిస్తే ఏం చేయాలో తెలుసా?

భారతదేశంలో హిందువులు తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ పరమ పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. ఇక

  • Written By:
  • Publish Date - October 28, 2022 / 06:30 AM IST

భారతదేశంలో హిందువులు తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ పరమ పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉంటారు. ఇక మహిళలు అయితే ప్రతిరోజు ఉదయాన్నే తల స్నానం చేసి తులసి మొక్కకు శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. కాగా పురాణాల ప్రకారం తులసి మొక్క ఇంటికి రాబోయే నష్టాలను, దరిద్రాన్ని, అరిష్టాలను,దుష్టశక్తులను,నెగిటివ్ ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది అని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా తులసిని సర్వరోగ నివారిణి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఆయుర్వేదంలో ఎన్నో ఔషధాలకు తులసి మొక్కను ఉపయోగిస్తూ ఉంటారు. ఇకపోతే తులసి మొక్కలో కొన్ని కొన్ని సార్లు మనకు అనేక రకాల మార్పులు కనిపిస్తూ ఉంటాయి.

అలాగే ఆ ఇంటి యొక్క పరిస్థితులు అనుకూలతలను తులసి మొక్క ద్వారా కూడా తెలుసుకోవచ్చు అని పండితులు చెబుతూ ఉంటారు. అయితే తులసి మొక్కలు అప్పుడప్పుడు వచ్చే కొన్ని రకాల మార్పులకు కారణం ఏమై ఉంటుంది. అటువంటి సమయంలో ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇంత తులసి పుట్టుక నుంచి చావు వరకు ఉండాలి అని హిందూ పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్క చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మొక్క చేసే మేలు అంతా ఇంతా కాదు. ఒకవేళ తులసి మొక్క చనిపోతే ఆ తులసి మొక్కను అలాగే ఉంచకుండా వేర్లతో పాటు తొలగించి చనిపోయిన ఆ తులసి మొక్కను ఏదైనా నీటి ప్రవాహంలో వదిలేసి ఆ స్థానంలో మరొక తులసి మొక్కను నాటాలి.

కొన్నిసార్లు బుధ గ్రహం ప్రభావం వల్ల తులసి మొక్క ఎండిపోతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు పచ్చగా రేపుగా పెరుగుతూ పూలు పూస్తూ ఉంటుంది. అటువంటి ఎప్పుడు తులసి మొక్క పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది అని గుర్తించాలి. తులసి మొక్కను మన ఇంట్లో తూర్పు లేదా ఉత్తరం లేదంటే ఈశాన్య దిశలో మాత్రమే నాటాలి. కానీ తులసి మొక్కను ఎట్టి పరిస్థితులలో దక్షిణం వైపు మాత్రం నాటకూడదు. ఇలా చేస్తే సమస్యలు వస్తాయి. ఆదివారం, ఏకాదశి రోజు, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాంటి రోజులలో తులసి చెట్టుకు నీరు పోయకూడదు. అలాగే మామూలు రోజులలో సూర్యాస్తమయం తర్వాత తులసి చెట్టు నుంచి ఆకులు తెంపకూడదు. అలాగే ప్రతిరోజు తులసి నీరు పోయడంతో పాటు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. కానీ ఆదివారం మాత్రం చేయకూడదు.