Remove Fatigue: అలసటగా ఉంటోందా.. ఈ టిప్స్ ట్రై చెయ్యండి.. వెంటనే పోతుంది!

సాధారణంగా కొంతమంది ఎంత మంచి మంచి ఆహరం తీసుకున్న, అలాగే విశ్రాంతి తీసుకున్న కూడా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఇది మరింత తీవ్రమవుతూ ఉంటుంది. అయితే ఈ అలసట ని చాలామంది

  • Written By:
  • Publish Date - September 10, 2022 / 10:15 AM IST

సాధారణంగా కొంతమంది ఎంత మంచి మంచి ఆహరం తీసుకున్న, అలాగే విశ్రాంతి తీసుకున్న కూడా అలసటగా అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఇది మరింత తీవ్రమవుతూ ఉంటుంది. అయితే ఈ అలసట ని చాలామంది ఏమి కాదులే అంటూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా కూడా మరువచ్చు. కాబట్టి అలసట గా అనిపించినప్పుడు అందుకు తగిన తీసుకోవడం లేదు డాక్టర్ని సంప్రదించడం లాంటివి చేయాలి. వాటితో పాటుగా కొన్ని రకాల టిప్స్ ని పాటించడం వల్ల అలసటను దూరం చేసుకోవచ్చు.

మరి అందుకోసం ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుదీనా ఆకులు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్లే పుదినా ఆకులను మనం తినే ఆహార పదార్థాలలో అలాగే చల్లటి మజ్జిగ,టీ వంటి వాటిలో వేస్తూ ఉంటారు. మన శరీరంలో ఆహార వ్యర్తాలు,మందుల తాలూకా రసాయనాలు టాక్సీన్లుగా మిగిలిపోతాయి. ఇటువంటి వ్యర్థాలను తొలగించేందుకు పుదీనా నీరు చక్కగా ఉపయోగపడుతుంది.

అయితే ఇందుకోసం ఒక గాజు సీసాలో పుదీనా ఆకులు అలాగే నిమ్మకాయ ముక్కలనువేసి అందులో నీరు పోయాలి. ఆ నీటిని అలాగే గంట పాటు వదిలేసి ఆ తర్వాత కొద్దికొద్దిగా తాగడం వల్ల అలసట పోతుంది. పుదీనా ఆకుల సువాసన కూడా మెదడును తేలిక పరుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా అలసటగా అనిపించినప్పుడు నిమ్మకాయ, అలాగే పుదీనా ఆకులను నీటిలో వేసి దానిని గంటసేపు అలాగే ఉంచి అనంతరం ఆ నీటిని కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల అలసట దూరమవుతుంది.