Relationship : మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి…కరిగిపోతుంది…!!

భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ప్రేమ, గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న గొడవలు జరుగుతుంటేనే ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాంటి గొడవలు పరిష్కరించుకోకుండా అలాగే కొనసాగినట్లయితే సంబంధం చెడిపోతుంది.

  • Written By:
  • Updated On - August 9, 2022 / 10:08 AM IST

భార్యాభర్తల మధ్య ఎప్పుడూ ప్రేమ, గొడవలు జరుగుతూనే ఉంటాయి. చిన్న చిన్న గొడవలు జరుగుతుంటేనే ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాంటి గొడవలు పరిష్కరించుకోకుండా అలాగే కొనసాగినట్లయితే సంబంధం చెడిపోతుంది. భార్యాభర్తలలో ఎవరికి మనస్తాపం కలిగినా, మరొకరు వారిని శాంతింపజేయాలి. అలిగిన భార్యను ఎలా శాంతింపచేయాలో తెలుసుకుందాం.

భర్త చర్యలతో అసంతృప్తి:
భార్యాభర్తల మధ్య భావోద్వేగ బంధం చాలా ముఖ్యమైనది. మితిమీరిన భావోద్వేగం కారణంగా, భార్యలు తమ భర్తల చిన్న విషయాలపై కూడా గొడవపడుతుంటారు. అలాంటి పరిస్థితిలో మరింత కోపంగా రగిలిపోతుంటారు. కోపంతో ఉన్న భార్యను ఒప్పించడం అంత సులభం కాదని ప్రతి భర్తకు తెలుసు.

క్షమాపణ చెప్పండి :
మీరు మీ భార్యను బాధపెట్టినట్లయితే, ఆమెకు క్షమాపణ చెప్పండి. క్షమాపణ అడగడం వల్ల మీ స్టేటస్ ఏమాత్రం తగ్గదు. బదులుగా, మీ సంబంధం మెరుగుపడుతుంది. ఇద్దరూ ప్రశాంతంగా మాట్లాడుకుంటూ…ఒకరినొకరు అర్థం చేసుకోండి.

భార్య శాంతించేందుకు కొంత సమయం ఇవ్వండి:
మీకు, మీ భార్యకు ఏదైనా విషయంలో గొడవలు వచ్చినా, ఏదైనా కారణం చేత మీపై కోపం వచ్చినా శాంతింపజేయడం భర్తగా నీ కర్తవ్యం. కానీ కొన్నిసార్లు మీరు ఎంత ప్రయత్నించినా, మీ భార్య శాంతించకపోతే, ఆమెకు కొంత సమయం ఇవ్వండి. కాలం గడిచే కొద్దీ మీ కోపం చల్లారుతుంది. అప్పుడు ఆమెతో ప్రశాంతంగా మాట్లాడండి.

బహుమతులు ఇవ్వండి :
స్త్రీ బహుమతిని ప్రేమిస్తుంది. ఎవరైనా బహుమతి ఇస్తే చాలా సంతోషిస్తారు. కోపంతో ఉన్న భార్యను శాంతింపజేయడానికి మీరు పువ్వులు, బహుమతులు వంటివి ఇవ్వండి. అది చూడగానే కోపం కరిగిపోతుంది.

మీరే వంట చేసి పెట్టాలి :
మీ భార్యను ఆకట్టుకోవడానికి మరొక గొప్ప మార్గం ఏమిటంటే, మీ చేతులతో వంట వండిపెట్టడం. ఇంట్లో, భార్య ఎప్పుడూ మీ కోసం వంట చేస్తుంది. కానీ ఆమెను ఒప్పించేందుకు మీరే వంట చేయాలి ఇది మీ పట్ల ఆమెకున్న కోపాన్ని తగ్గించి, మీ పట్ల ఆమెకున్న ప్రేమను పెంచుతుంది. ఆమెకు నచ్చిన వంట చేయండి. భర్త వండి వడ్డిస్తే ప్రతి భార్య సంతోషిస్తుంది.

శారీరక సంబంధం :
భార్యాభర్తలు నిద్రపోయే వరకు గొడవపడటం చూస్తుంటారు. మీ శారీరక సంబంధాన్ని తాజాగా ఉంచడం ద్వారా మీరు భార్య కోపాన్ని తగ్గించినట్లవుతారు. శారీరక సంబంధం ఇద్దరు వ్యక్తులను మానసికంగా కనెక్ట్ చేయడంలో సహాయపడుతుంది.

షాపింగ్ చేయండి :
మహిళలు షాపింగ్ చేయడానికి ఇష్టపడతారు. తన వార్డ్‌రోబ్‌లో ఎన్ని బట్టలు ఉన్నా, ఆమె ఎప్పుడూ ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటుంది. మీ భార్య మీపై కోపంగా ఉంటే, షాపింగ్ చేయడం ద్వారా ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించండి. ప్రేమతో క్షమించండి. షాపింగ్ మూడ్‌లో భార్య మిమ్మల్ని తప్పకుండా మన్నిస్తుంది.