Pregnancy: ప్రెగ్నెన్సీలో పిగ్మెంటేషన్ పోవాలంటే…!

స్త్రీ గర్భం దాల్చడం అనేది...వారి జీవితంలో అది ఓ మధురానుభూతి. అమ్మా అనిపించుకోవాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. అమ్మగా మారే తరుణంలో ఆ మధుర క్షణాలను కడుపులో ఉన్న బిడ్డకోసం...తన చర్మ సంరక్షణను పక్కన పెట్టేస్తుంది.

  • Written By:
  • Updated On - January 19, 2022 / 08:01 PM IST

స్త్రీ గర్భం దాల్చడం అనేది…వారి జీవితంలో అది ఓ మధురానుభూతి. అమ్మా అనిపించుకోవాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. అమ్మగా మారే తరుణంలో ఆ మధుర క్షణాలను కడుపులో ఉన్న బిడ్డకోసం…తన చర్మ సంరక్షణను పక్కన పెట్టేస్తుంది. దాంతో వారిలో చర్మ సమస్యలు ఏర్పడతాయి. ఈ చర్మ సమస్యలకు దూరంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

సాధారణంగా మహిళలకు గర్భదారణ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల మెడ నల్లగా మారడం, ఎద భాగాల దగ్గర నల్లగా అవ్వడం వంటిది జరుగుతుంది. అంతేకాదు గర్భదారణ సమయంలో చర్మం సాగుతుంటుంది. దీంతో చర్మం పొడిబారిపోతుంది. కాబట్టి చర్మానికి తగినంతగా తేమను అందించేందుకు ప్రతిరోజూ మాయిశ్చరైజింగ్ రాస్తుండాలి. ఇక గర్భవతిగా నాలుగో నెల సమయంలో మెడ, పొత్తికడుపు, తొడలపై స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. అంతేకాదు ముఖంపై నల్లగా మచ్చలు వస్తుంటాయి. ఈ సమస్యలు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాయి. ముఖ్యంగా కొంత మందిలో హార్మోన్ల సమస్య కారణంగా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి.

ఇక గర్భవతిగా ఉన్న సమయంలో చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి చర్మ సంరక్షణ కోసం ఉపయోగించే బ్యూటీ ప్రొడక్ట్స్ గాఢత తక్కువగా ఉన్నవాటిని ఎంచుకోవాలి. బ్యూటీ ప్రొడక్ట్స్ సెలక్ట్ చేసుకునే విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖానికి, శరీరానికి రసాయనాలు లేని ప్రొడక్టులను సెలక్ట్ చేసుకోవడం మంచిది. కొబ్బరినూనె లేదా బాదం నునెతో చర్మానికి మర్దన చేసుకోవాలి. ఇవి సహజసిద్ధమైనవి కాబట్టి చర్మానికి ఎలాంటి హానీ కలగదు. ఇక నీరు తక్కువగా తాగినట్లయితే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

ప్రెగ్నెన్సీ సమయంలో నీటిని ఎక్కువగా తాగాలి. ఎందుకంటే నీరు ఎక్కువగా తాగినట్లయితే చర్మ సంరక్షణతోపాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి రోజుకు 8 గ్లాజుల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే డీ హైడ్రెషన్ బారిన పడకుండా ఉంటారు. గోరువెచ్చని నీటితో స్నానం చేసినట్లతే చర్మానికి తేమను అందించవచ్చు. స్టెచ్ మార్కులను తగ్గించుకునేందుకు విటమిన్ ఈ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి.
అంతేకాదు హార్మోన్ల సమతుల్యతను తగ్గించుకునేందుకు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పోలిక్ యాసిడ్, విటమిన్ సి పుష్కలంగా లభించే ఆకుకూరలు, పండ్లు, బ్రోకలీ, బీన్స్, సిట్రస్ ఫలాలు ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ కూడా అమ్మకు, బిడ్డ ఆరోగ్యానికి మేలు చేయడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేలా సహాయపడతాయి.