Recipes for Weight Loss: ఫాస్ట్‌గా బరువు తగ్గడానికి ఈ రెసిపీస్‌ ట్రై చేయండి..!

శనగలు.. చాలా మంది స్నాక్స్‌గా తీసుకునే వీటిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ముఖ్యంగా వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారట. మరి అదెలానో ఇప్పుడు చూద్దాం.

శనగలు.. చిన్నవి ఉంటాయి. పెద్దవి ఉంటాయి. ఇందులో పెద్ద శనగలని కాబూలి అంటారు. వీటితో ఎక్కువగా కర్రీస్ (Recipes) వండుకుంటారు. చిన్న శనగలని స్నాక్స్‌లా చేసుకుంటారు. గుగ్గిల్లా చేసుకుని తింటారు. వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా త్వరగా బరువు తగ్గుతారని చెబుతున్నారు నిపుణులు. అందుకోసం ఎలా వీటిని ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం.

బరువు తగ్గడం:

ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే త్వరగా బరువు తగ్గుతారు. దీని ప్రకారమే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న శనగలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. దీంతో బరువు తగ్గుతారు. వీటితో పాటు శనగలు ఎక్కువగా తింటే క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గుతుంది.

శనగల్లోని విటమిన్స్:

శనగల్లో ఎక్కువగా విటమిన్స్ ఉంటాయి. ఇందులో ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటు ఫోలేట్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్‌లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కేలరీలు తగ్గడం:

ఎక్కువగా ఫైబర్ ఉన్న శనగలు తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. దీని వల్ల కేలరీలు తగ్గుతాయి. దీంతో బరువు తగ్గుతారు. అయితే, వీటిని తినడం వల్ల బరువు ఎలా తగ్గాలంటే..

ఇన్‌స్టంట్ చనా మసాలా రెసిపీస్‌:

చనా మసాలా రెసిపీస్‌ (Chana Masala Recipes) త్వరగా తయారవ్వడమే చాలా టేస్టీగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు..

1 కప్పు శనగలు
2 టేబుల్ స్పూన్ల నూనె
2 లవంగాలు
2 యాలకులు
1 మీడియం సన్నగా తరిగిన ఉల్లిపాయ
2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్
2 స్పూన్ల వెల్లుల్లి పేస్ట్
1 పచ్చిమిర్చి
2 మీడియం టమాటో ప్యూరీ
అర స్పూన్ పసుపు
ఒకటిన్నర స్పూన్ కారం
1 టీ స్పూన్ కొత్తిమీర
1 టీ స్పూన్ ధనియా పొడి
అరటీస్పూన్ ఆమ్‌చూర్

తయారీ విధానం:

ముందుగా శనగలని కడిగి నానబెట్టండి. నీరు తీయండి. ఇప్పుడు పాన్ పెట్టుకుని నూనె వేయండి. నూనె వేడయ్యాక లవంగాలు, యాలకులు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ తరుగు వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత టమాట ప్యూరీ వేసి బాగా కలపండి. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం, ధనియ పొడి వేసి ఫ్రై చేయండి. తర్వాత నానబెట్టిన శనగలు వేసి ఫ్రై చేసి దీనిని 20 నుంచి 25 నిమిషాల పాటు మెత్తగా ఉడికించండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయండి.

శనగల పరాఠా రెసిపీస్‌ (Shangala Paratha Recipes):

కావాల్సిన పదార్థాలు

2 కప్పుల గోధుమపిండి
1 కప్పు పచ్చి చిక్‌పీస్
1 మీడియం ఉల్లిపాయ తరుగు
కొత్తిమీర తరుగు
1 పచ్చిమిర్చి
1 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం
1 టేబుల్ స్పూన్ కారం
అరటేబుల్ స్పూన్ గరం మసాలా
అర టేబుల్ స్పూన్ ఆమ్‌చూర్ పొడి
3 టేబుల్ స్పూన్ క్యారమ్ సీడ్స్
13 టేబుల్ స్పూన్ నూనె
రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం:

ముందుగా గోధుమ పిండిలో నీరు పోసి కలపండి. దీనిని అరగంట నానబెట్టండి. ఇప్పుడు శనగలన్ని ముందుగానే 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టి బాగా ఉడికించాలి. మెత్తగా వాటిని పిండిలా చేసి ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, కారం, గరం మసాలా, యాలకుల పొడి, ఇంగువు రుచికి సరిపడా వేసి కలపండి. ఈ పిండిని తీసుకుని అందులో ముద్దలా చేసి గోధుమపిండిలో పెట్టి పరాటాల్లా నొక్కి నూనె, నెయ్యితో కాల్చుకుని పెరుగు, చట్నీతో తినండి.

Also Read:  No Selfies Day: ఈరోజు ‘నో సెల్ఫీస్‌ డే’.. మనం కూడా పాటిస్తామా?