Fruit Face Packs : ఫేస్ టాన్ అయిపోతుందా ? ఈ ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి..

వేసవిలో మనకు ఎక్కువగా దొరికేవి మామిడి పండ్లు. మామిడిలో విటమిన్ సి, ఇ ఉంటాయి. ఇవి చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. కణాల పునరుత్పత్తిని సైతం ప్రోత్సహిస్తాయి. పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గుతాయి.

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 11:18 PM IST

Fruit Face Packs : ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వేసవిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తినాలని చెబుతారు. నీటితో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, సహజ ఆమ్లాలు కూడా శరీరానికి అందుతాయి. తాజా పండ్లు ఎక్కువగా వేసవిలోనే దొరుకుతాయి. ఎందుకంటే వేసవిలో పండ్లను ఎక్కువరోజులు నిల్వ చేయలేం కాబట్టి. పండ్లు తినడం ద్వారానే కాదు.. వాటితో ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ కూడా వేసుకోవచ్చు. ఇవి ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. ఇవే మనకు నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా.

మామిడి – పెరుగు ఫేస్ ప్యాక్

వేసవిలో మనకు ఎక్కువగా దొరికేవి మామిడి పండ్లు. మామిడిలో విటమిన్ సి, ఇ ఉంటాయి. ఇవి చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. కణాల పునరుత్పత్తిని సైతం ప్రోత్సహిస్తాయి. పెరుగుతో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. పండున మామిడి గుజ్జును పెరుగులో కలిపి.. ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ముఖంపై పేరుకున్న మురికిని, రంధ్రాలను తొలగిస్తుంది.

బొప్పాయి – తేనె ఫేస్ ప్యాక్

బొప్పాయిలో విటమిన్స్, ఎంజైమ్స్ పుష్కలం. పండిన బొప్పాయి గుజ్జులో ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనెను కలపాలి. దీనిని ముఖానికి సమానంగా రాసి.. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఈ ప్యాక్ త కణాలను తొలగిస్తుంది. తేనె స్కిన్ ను హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

బనానా ఫేస్ ప్యాక్

అరటిపండ్లలో విటమిన్ బీ6, పొటాషియం, సిలికా వంటి పోషకాలుంటాయి. చర్మానికి ఇవి చాలా మేలు చేస్తాయి. హైపర్ పిగ్మెంటేషన్ నుంచి రక్షణనిస్తుంది. అరటిపండు, హాఫ్ టీ స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి ప్యాక్ ను తయారు చేసుకోవాలి. ముఖంపై అప్లై చేసి.. ఆరిపోయాక చల్లటినీటితో కడిగేసుకోవాలి. ఇది ఫేస్ ను అందంగా తయారు చేస్తుంది.

కివీ – అవకాడో ప్యాక్

ఈ రెండు పండ్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. దీనిని యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ అని కూడా పిలుస్తారు. కివీ, అవకాడో గుజ్జును తీసుకుని.. మెత్తటి పేస్ట్ గా చేసుకోవాలి. ఈ మిశ్రమానికి తేనెను కలుపుకుని.. ముఖం, మెడపై అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత ప్యాక్ ను చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

యాపిల్ – నారింజ ఫేస్ ప్యాక్

యాపిల్, నారింజ ముక్కల్ని కలిపి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఇందులో పాలు కలిపి ముఖానికి అప్లై చేయాలి. పావుగంట తర్వాత కడగాలి. ఇదొక యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫేస్ ప్యాక్. చర్మానికి పోషణనిచ్చి మెరిసేలా చేస్తుంది.