Fish Recipe : సండే ఫిష్ తినాలని ఉందా..అయితే ఇలా చేస్తే, ఒక్క పీసు కూడ మిగల్చరు..!!

  • Written By:
  • Updated On - November 20, 2022 / 12:45 PM IST

నాన్ ప్రియులకు చికెన్, మటన్ తిని బోర్ కొట్టిందా. అయితే చేపల పులుసు ట్రై చేసి చూడండి. అయితే చేపల పులసు వండే విధానంలో చిన్న చిట్కా ఉంది . అది ఫాలో అవుతే రుచి అమోఘం. వాసన అద్బుతం.

చేపల పులుసు విధానంలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకునేంది…చేపల పులుసు. ఎలా చేయాలో తెలుసుకుందాం.

చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు:

1. చేపలు కేజీ,
నిమ్మరసం కొద్దిగా,
ఉప్పు సరిపడా,
కారం 1న్నర టేబుల్ స్పూన్,
పసుపు చిటికెడు,
గరం మసాలా – 1 టీస్పూన్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీస్పూన్లు,
నూనె 2 టేబుల్ స్పూన్లు,
పచ్చిమిర్చి 4
జీలకర్ర – 1 స్పూన్,
చిన్న ఉల్లిపాయ
చింతపండు పులుసు
ధనియాల పొడి 1 టీస్పూన్,
వేయించిన జీర పౌడర్ పావు టీస్పూన్,
కొత్తిమీర కొద్దిగా,
మెంతుల పొడి – పావు టీ స్పూన్.

తయారీ విధానం
ముందుగా చేపలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నీళ్లన్నీ ఆరిపోయాక వాటిపై ఉప్పు, నిమ్మరసం వేసి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటిని మరో రెండు సార్లు కడగాలి. ఎందుకంటే చేపలు తినడానికి రుచిగా ఉన్నప్పటికి వాసన మాత్రం ఒకారం వచ్చేలా చేస్తుంది. అందుకే రెండు సార్లు శుభ్రంగా కడిగినట్లయితే పులుసు చెడు వాసన రాకుండా ఉంటుంది.

రెండు సార్లు శుభ్రంగా కడిగిన చేపల ముక్కలపై ఉప్పు వేయాలి. కారం, మీకు నచ్చింత వేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలనుకునేవారు ఎక్కువగా వేసుకోవచ్చు. అందులో చిటికెడు పసుపు గరంమసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేయాలి. వీటిని చేపలకు పట్టించి ఓ ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ వెలిగించి…పాన్ లో నూనె పోయాలి. ప్యాన్ పెద్దగా ఉండేలా చూసుకోండి. చేపల కూర వండేటప్పుడు ప్యాన్ పెద్దగా ఉండాలని మర్చిపోవద్దు.

నూనె వేడి అయ్యాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయలన్నీ మంచిగా వేగిన తర్వాత చేపల ముక్కలను ఒక్కొక్కటి ప్యాన్ లో వేయాలి. నెమ్మదిగా వేసి…చిన్న ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ముక్కలు అన్ని వైపులా వేగిన తర్వాత మూడు నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఎందుకంటే ఎక్కువ వేడితో వేయించినట్లయితే ముక్కలు నుజ్జునుజ్జు అవుతాయి.

రెండు వైపుల ముక్కలు వేగినతర్వత చింతపండు పులుపు పోయాలి. పులుసు పోసిన తర్వాత ముక్కలను నెమ్మదిగా కదపండి. ముక్కలు మునిగిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీయండి. చివరిగా ధనియాల పొడి, వేయండి. వేయించిన జీర పౌడర్ కొత్తి మీర చల్లండి. వీటితోపాటు మెంతుల పొడి, వేయడం మర్చిపోవద్దు. ఇప్పటికే చేపల పులుసు మసులుతున్నా కొద్దీ మీకు వాసన నోరూరించేలా ఉంది కదూ. అంతే సింపుల్ చేపల పులుసు రెడీ. వండిన రోజు కాకుండా మరుసటి రోజు తింటే రుచి మరింత ఎక్కువగా ఉంటుది.