Dandruff : చుండ్రుతో జుట్టు ఊడి బట్టతల అవుతోందా..అయితే అల్లం రసంతో ఇలా చేయండి…

జలుబు, దగ్గు వచ్చిందంటే అల్లం డికాక్షన్ తీసుకోవడం పురాతన కాలం నుంచి వస్తుంది. అల్లంలోని క్రియాశీల సమ్మేళణం, జింజెరాల్, అనాల్జేసిక్, యాంటి పైరేటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షలను కలిగి ఉంటుంది.

  • Written By:
  • Publish Date - July 20, 2022 / 08:00 AM IST

జలుబు, దగ్గు వచ్చిందంటే అల్లం డికాక్షన్ తీసుకోవడం పురాతన కాలం నుంచి వస్తుంది. అల్లంలోని క్రియాశీల సమ్మేళణం, జింజెరాల్, అనాల్జేసిక్, యాంటి పైరేటిక్, యాంటీ బాక్టీరియల్ లక్షలను కలిగి ఉంటుంది. జింజెరోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల శరీరంలోని గ్యాస్ తో పోరాడటంలో అల్లం ప్రముఖపాత్ర పోషిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడానికి, చర్మాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. అల్లం మన ఆరోగ్యానికే కాదు..జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్న సంగతి మీకు తెలుసా. అల్లం ఒక అద్భుతమైన సౌందర్యం పదార్థంగా ఉపయోగపడుతుంది. అల్లం ఉపయోగించడం వల్ల మీరు స్కాల్ప్ ఇన్ఫెక్షన్లు ,చుండ్రు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

అల్లం రసం…ఏవిధంగా ఉపయోగించాలి:
యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల చర్మం, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి అల్లం రసాన్ని ఫేస్ మాస్క్ లతోపాటు హెయిర్ మాస్క్ లకు కూడా ఉపయోగించవచ్చు.

చండ్రు నివారణకు:
అల్లం రసం మీ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దురద, చుండ్రును ఎదుర్కోవడంలో కూడా సహాయపడుతుంది. చుండ్రుతో పోరాడటానికి ఇది పాతకాలం నాటి నివారణ, మీరు ఖరీదైన షాంపూ, ఉత్పత్తులను వాడుతున్నట్లయితే వాటిని పక్కన పెట్టి…ఇదొక సారి ట్రై చేసి చూడండి.

జుట్టు రాలకుండా ఉండేందుకు :
జుట్టు రాలడానికి ప్రధాన కారణం చుండ్రు. కాబట్టి జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి కొందరు అల్లం రసాన్ని ఉపయోగిస్తారు. అయితే జుట్టు రాలడాన్ని నివారించడంలో అల్లం పాత్ర ముఖ్యమైనది. ఇది ఖచ్చితంగా చుండ్రును తగ్గించడంలో మీకు సహాయపడుతుంది.

అల్లం రసం ఎలా ఉపయోగించాలి?
తాజా అల్లం తీసి బాగా కడగాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని…నీళ్లలో వేసి చిన్న మంటపై మరగించాలి. నెమ్మదిగా నీటిరంగు మారుతుంది. కొన్ని నిమిషాల తర్వాత పసుపు రంగులోకి మారుతుంది. ఆ నీటి వడకట్టి ఫిల్టర్ చేయండి. ఈ నీటిని ఒక చిన్న స్ప్రే బాటిల్లో వేసి మీ తలపై స్ప్రే చేయండి.

జుట్టుకు ప్యాక్:
మీరు హెయిర్ మాస్క్ గా అప్లై చేస్తే…దానిని తలపై అరగంటపాటు ఉంచి..తర్వాత తేలికపాటి యాంటీ డాండ్రఫ్ షాంపూతో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే చుండ్రు సమస్యతోపాటుగా తలలో వచ్చే దురద కూడా తగ్గుతుంది.