Egg Shells Facepack : కోడిగుడ్డు పెంకులతో ఫేస్ ప్యాక్స్.. ఉపయోగాలు తెలిస్తే అస్సలు పారేయరు..

గుడ్డు పెంకుల్ని శుభ్రం చేసి.. మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో వెనిగర్ ను కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. ముఖంపై పేరుకున్న క్రిములు తొలగిపోతాయి.

  • Written By:
  • Publish Date - February 29, 2024 / 08:40 PM IST

Egg Shells Facepack : కోడిగుడ్లు మన ఆహారంలో ఒక భాగం. వీటిలో ప్రొటీన్ అధికం. అందుకే రోజుకొక కోడిగుడ్డైనా తినాలని చెబుతారు. ఉడకబెట్టినవి లేదా ఆమ్లెట్ వేసుకుని తినొచ్చు. అయితే.. కోడిగుడ్డును ఎలా తిన్నా వాటి పెంకుల్ని చెత్తబుట్టలో పడేస్తుంటాం. కోడిగుడ్డలోపల ఉండే తెల్లసొన, పచ్చసొన లోనే కాదు.. దాని పెంకులోనూ ప్రయోజనాలుంటాయి. వీటితో ముఖానికి ఫేస్ ప్యాక్ లు వేసుకుంటే.. వన్నెతరగని అందం మీ సొంతం అవుతుంది. అంతేకాదు గాయాలను కూడా తగ్గించుకోవచ్చు.

అల్సర్, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కోడిగుడ్డు పెంకులు ఉపశమనాన్నిస్తాయి. గుడ్డు పెంకుల్ని ఒక గాజు కూజాలో పగలగొట్టి.. వాటిలో ఆపిల్ సైడ్ వెనిగర్ ను కలపండి. వెనిగర్ లో కొల్లాజెన్, కొండ్రోయిటిన్, గ్లూకోసమైన, హైలురోనిక్ యాసిడ్ వంటి పోషకాలను కలిపి.. రెండ్రోజులు ఉంచండి. ఇప్పుడు పెంకులు కలిగిపోతాయి. ఈ మిశ్రమాన్ని పుండ్లు, గాయాలపై రాస్తే.. త్వరగా తగ్గుతాయి.

ఇంట్లో పెరిగే మొక్కలకు గుడ్డు పెంకులను వేస్తే.. వాటికి అవసరమైన కాల్షియం, ఇతర ఖనిజాలు దొరుకుతాయి. గుడ్డుపెంకుల్ని శుభ్రం చేసి.. మొక్క ఉన్న మట్టిలో వేస్తే.. అవి మట్టిలో కలిసిపోయి.. బలంగా పెరుగుతాయి.

గుడ్డు పెంకుల్ని శుభ్రం చేసి.. మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో వెనిగర్ ను కలిపి ముఖానికి మసాజ్ చేయాలి. ముఖంపై పేరుకున్న క్రిములు తొలగిపోతాయి.

అలాగే.. గుడ్డుపెంకుల పొడిలో రెండు చెంచాల తేనె కలిపి రాస్తే.. మచ్చలు తగ్గుతాయి.

కోడిగుడ్డు పెంకులపొడిలో కలబంద గుజ్జును కలిపి ముఖానికి రాసుకోవచ్చు. దీనివల్ల చర్మానికి అవసరమైన తేమ దొరకడంతో పాటు.. ముఖానికి కాంతి వస్తుంది.

గుడ్డు పెంకులతో తయారు చేసిన పౌడర్ కు లెమన్ జ్యూస్ లేదా వెనిగర్ ను కలిపి రాస్తే.. చర్మంపై మచ్చలు తగ్గుతాయి. ఇన్ ఫెక్షన్స్ రావు.

గుడ్డు పెంకులతో చేసిన పొడికి కొద్దిగా చక్కెరను కలిపి.. తర్వాత తెల్లసొన కలిపి ముఖానికి మాస్క్ లాగా వేసుకోవాలి. కొద్దిరోజులకే మీ ముఖంలో మార్పును గమనిస్తారు.

Also Read : Bangles: ఆడవారు చేతులకు ఎన్ని గాజులు వేసుకోవాలి.. వాటి వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసా?

 

 

 

Follow us