Summer skin care: సమ్మర్ లో ట్రిప్ కి వెళ్తున్నారా.. అయితే ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే?

అప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఇక వేసవికాలం వచ్చింది అంటే చాలు చిన్నపిల్లలకు హాలిడేస్ రావడంతో ఫ్యామిలీలు వెకేషన్ లకు వెళ్లి ఫుల్ గా ఎంజా

  • Written By:
  • Updated On - February 15, 2024 / 09:46 PM IST

అప్పుడు ఎండలు మండిపోతున్నాయి. ఇక వేసవికాలం వచ్చింది అంటే చాలు చిన్నపిల్లలకు హాలిడేస్ రావడంతో ఫ్యామిలీలు వెకేషన్ లకు వెళ్లి ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది చల్లని ప్రాంతాలు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి కాస్తా సేద తీరాలనుకుంటారు. ఆ విధంగానే ప్లాన్ చేసి ఎంజాయ్ చేస్తారు. అయితే వేసవికాలంలో బయటకు వెళ్తున్నారు అంటే దానికి సంబంధించిన విషయాలలో మాత్రమే కాకుండా చర్మానికి సంబంధించిన విషయాలలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా సమ్మర్ లో బయటకు వెళ్ళేటప్పుడు స్కిన్ కు సంబంధించి ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఇంతకీ సమ్మర్ లో ఎలాంటి టిప్స్ ను ఫాలో అయితే చర్మం మెరుస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీరు జర్నీ చేయడానికి ముందు నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చే వరకూ మీ స్కిన్‌పై మాయిశ్చరైజర్ ప్లే చేయాలి. దీని వల్ల మీ స్కిన్ హైడ్రేట్‌గా ఉంటుంది. ఇలా చేస్తే వాతావరణంతో సంబంధం లేకుండా మీ స్కిన్ మృదువుగా, కోమలంగా ఉంటుంది. ఒక వేళ మీ స్కిన్ డ్రైగా అనిపిస్తే మళ్ళీ అప్లై చేసుకోవడం మంచిది. అదే విధంగా, సన్ స్క్రీన్ లోషన్ కూడా ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఏ కాలమైనా దీనిని వాడాల్సిందే. ముఖ్యంగా ఎండాకాలంలో దీని వల్ల స్కిన్‌ని డ్యామేజ్ చేసే యూవి కిరణాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన కిరణాలు పడకుండా చేయవచ్చు. దీంతో వృద్ధప్య లక్షణాలు, ట్యాన్ వంటి సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. దీనిని 2, 3 గంటలకి ఓ సారి అప్లై చేయాలని గుర్తుపెట్టుకోండి. దీంతో సమస్య చాలా వరకూ దూరమవుతుంది. జర్నీ చేసినప్పుడు మీ స్కిన్‌పై దుమ్ము, ధూళి పేరుకుపోతుంది. దీంతో బ్రేకౌట్స్ ఏర్పడతాయి. ఈ కారణంగా మీ స్కిన్ చాలా నిర్జీవంగా మారుతుంది. కాబట్టి, మీరు ఎటైనా ప్రయాణించిన తర్వాత మీ ముఖాన్ని మైల్డ్ క్లెన్సర్‌తో క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి కణాలు దూరమవుతాయి. ముఖ్యంగా సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే దుస్తుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్ కి తగ్గట్టుగా మీకు కంఫర్ట్ గా ఉండే బట్టలను మాత్రమే ధరించాలి. బిగుతుగా ఉండే బట్టలు ధరించడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

అలాగే టోనర్ కూడా చాలా ముఖ్యం. అయితే, ఈ సమయంలో టోనర్ క్యారీ చేయడం వంటివి ఇబ్బందిగా ఉంటే మీరు వాటికి బదులుగా బ్లాటింగ్ టోనింగ్ పేపర్స్ కూడా వాడొచ్చు. దీని వల్ల ముఖంపై ఉన్న నూనె తొలగి సమస్య దూరమవుతుంది. సమ్మర్ లో చేయాల్సిన అతి ముఖ్యమైన పని నీరు తాగడం. మీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగితే మీ బాడీనే కాదు, స్కిన్ కూడా హైడ్రేట్‌గా ఉండడం చాలా ముఖ్యం కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ నీటిని తాగడానికి ప్రయత్నించాలి. జ్యూస్ వంటి వాటికి బదులుగా ఎక్కువగా నీటిని తాగడం మంచిది. ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా కంటి కింద వలయాలను దూరం చేయడం. ఐస్ ప్యాక్‌ని కళ్ళపై పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రయాణంలో హెల్ప్ అవుతాయి.